
మండలాల వారీగా వివరాలిలా..
●
వర్షం వస్తే చిత్తడి..
వర్షం వస్తే తరగతి గదుల్లోకి నీరు చేరి చిత్తడిగా మారుతున్నాయి. కొన్ని చోట్ల గోడలు నెర్రలుబారి ప్రమాదకరంగా మారాయి. వర్షపు నీటితో పుస్తకాలు తడుస్తున్నాయి. ఇప్పటికై నా గదుల నిర్మాణం పూర్తి చేసి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి.
– పవన్, పదో తరగతి విద్యార్థి, ఉండవెల్లి
నిధులు రాకపోవడంతోనే..
మన ఊరు–మన బడిలో భాగంగా నిర్మించిన పాఠశాల భవనాలకు నిధులు రాలేదు. అనేక మంది కాంట్రాక్టర్లకు వారు చేపట్టిన నిర్మాణానికి సంబంధించి బిల్లులు చెల్లించాల్సి ఉంది. పాత బిల్లులు చెల్లిస్తేగాని నిర్మాణ పనులు పూర్తిచేయమని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. నిధులు వచ్చిన వెంటనే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి అసంపూర్తి పనులు పూర్తిచేస్తాం.
– నాగరాజు, పంచాయతీరాజ్ ఈఈ
అయిజ/ఉండవెల్లి: ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్యను, సౌకర్యాలను అందించాలనే సంకల్పంతో గత ప్రభుత్వం అమలు చేసిన ‘మన ఊరు– మన బడి’ పనులు నిధుల కొరతతో కొన్ని చోట్ల ఆగిపోయాయి. కొన్నిచోట్ల పూర్తి కాగా.. మరికొన్నిచోట్ల అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. ఆయా పనులు మూడేళ్లుగా నత్తనడకన సాగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక ప్రస్తుత ప్రభుత్వం ‘అమ్మ ఆదర్శ పాఠశాలల’ పేరుతో పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, తరగతి గదుల నిర్మాణం వంటి పనులు చేపట్టేందుకు పూనుకోగా అవి కూడా ఎక్కడికక్కడే ఉన్నాయి. ఈ విద్యా సంవత్సరం పునఃప్రారంభమైనా.. అసంపూర్తి పనులే దర్శనమిస్తున్నాయి.
రూ.30 కోట్ల బిల్లులు పెండింగ్..
జిల్లాలో మొత్తం 460 పాఠశాలలు ఉండగా 284 పాఠశాలలను ‘మన ఊరు–మన బడి’ పథకానికి ఎంపిక చేశారు. దానికోసం సుమారు రూ.77 కోట్లు కేటాయించారు. ఈ పథకంలో మెరుగైన మౌలిక వసతులు కల్పించాలని పనులు ప్రారంభించారు. వాటిలో ముఖ్యంగా నూతన పాఠశాలలు, మరుగుదొడ్లు నిర్మాణం, బాత్‌రూంల ఏర్పాటు, సరిపడినన్ని తరగతి గదులు, వంటగదుల నిర్మాణాలు ఉన్నాయి. అదేవిధంగా విద్యార్థులు కూర్చునేందుకు సౌకర్యవంతమైన బెంచీలు ఏర్పాటు చేయాలని, అన్నింటికంటే ముఖ్యంగా తాగునీటి వసతి కల్పించాలని ఈ పథకాన్ని రూపకల్పన చేశారు. ఈ నిర్మాణ పనుల్లో 142 పాఠశాలల్లో 49 చోట్ల పనులు పూర్తయ్యాయి. 89 పాఠశాలలు అసంపూర్తిగానే ఉన్నాయి. 4 పాఠశాలల నిర్మాణం ఇప్పటి వరకు ప్రారంభించలేదు. నిర్మాణం చేసిన వాటికి సుమారు రూ.30 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉందని కాంట్రాక్టర్లు వాపోతున్నారు. చేసిన పనులకు ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో పనులు పూర్తి చేసేందుకు వారు ససేమిరా అంటున్నారు. నిర్మాణం చేపట్టిన మేరకు బిల్లులు చెల్లిస్తేగాని పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తిచేయమని బీష్మించుకుచున్నారు.
సమస్యలతో విద్యార్థుల సతమతం
చాలా పాఠశాలల్లో తరగతి గదుల కొరత వేధిస్తోంది. మరికొన్ని శిథిలావస్థకు చేరుకున్నాయి. తరగతి గదుల గోడలు కుంగిపోయి.. వర్షపు గదుల్లోకి చేరి విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకవైపు ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పిస్తాం.. మీ పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చేర్పించాలి అని పలు సమావేశాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు పేర్కొంటున్నా.. వాస్తవానికి వచ్చే సరికి పరిస్థితి వేరేలా ఉంది. ప్రైవేట్ పాఠశాల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థులకు ఈ సమస్యలే స్వాగతం పలుకుతుండడంతో జంకుతున్నారు. ఇప్పటికై న ఉన్నతాధికారులు స్పందించి మన ఊరు మన బడి పథకానికి సంబంధించి పెండింగ్ బిల్లులు విడుదల చేయడంతోపాటు.. అసంపూర్తిగా ఉన్న 93 పాఠశాలలు, తరగతి గదుల నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులు పూర్తి చేయాలని.. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.
జిల్లాలో ‘మన ఊరు – మన బడి’
వివరాలిలా..
ఎంపికై న
పాఠశాలలు 142
నిర్మాణం పూర్తయినవి 49
అసలు
ప్రారంభించనివి 4
నిర్మాణ దశలో ఉన్నవి 89
మండలం ఎంపికై నవి పూర్తయినవి పురోగతిలో
ఉన్నవి..
గద్వాల 23 7 16
అయిజ 19 5 12
ఉండవెల్లి 8 2 6
మానవపాడు 8 5 2
ఇటిక్యాల 18 11 7
మల్దకల్ 13 2 11
అలంపూర్ 11 0 11
ధరూరు 15 0 11
కేటీదొడ్డి 12 9 3
వడ్డేపల్లి 9 2 8
రాజోళి 6 2 4

మండలాల వారీగా వివరాలిలా..

మండలాల వారీగా వివరాలిలా..