
చదువులు ఎలా..?
జోగుళాంబ గద్వాల
బడి ఇలా..
గురువారం శ్రీ 19 శ్రీ జూన్ శ్రీ 2025
వివరాలు 8లో u
ఇది ఉండవెల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని తరగతి గది. పైకప్పు పెచ్చులూడి శిథిలావస్థకు చేరింది. మరికొన్ని గదుల పరిస్థితి ఇలాగే ఉంది. వర్షం కురిసిన ప్రతి సారి నీరు పైకప్పు నుంచి తరగతి గదుల్లోకి చేరి విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యేవారు. ఈక్రమంలో ‘మన ఊరు–మన బడి’ పథకానికి ఈ పాఠశాలను ఎంపిక చేసి నూతన భవన నిర్మాణ పనులు ప్రారంభించారు. రెండేళ్లవుతున్నా బేస్‌మెంట్ వరకు వచ్చి పనులు నిలిచిపోయాయి. దీంతో వర్షాలు కురిసిన ప్రతిసారి శిథిలావస్థకు చేరిన పాఠశాల గదుల్లోకి నీరు చేరుతుందని, ఇక పాఠాలు ఎలా బోధించాలని ఉపాధ్యాయులు ఆవేదన చెందుతున్నారు. అటు భవన నిర్మాణం పూర్తి కాకపోవడం.. ఇటు తరగతి గదుల కొరతతో ఇరుకు గదుల్లోనే ఇబ్బందుల నడుమ విద్యార్థులు చదువులు కొనసాగించాల్సిన దుస్థితి నెలకొంది. జిల్లాలో అసంపూర్తి పనులతో ఎన్నో పాఠశాలల్లో విద్యార్థులు ఇలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
న్యూస్‌రీల్
జిల్లాలో అసంపూర్తిగా ‘మన ఊరు – మన బడి’ పనులు
పాఠశాలలు పునఃప్రారంభమైనా పునాది స్థాయిలోనే
భవన నిర్మాణాలు
రూ.30 కోట్ల బిల్లులు పెండింగ్..
చేతులెత్తేసిన కాంట్రాక్టర్లు
శిథిలావస్థకు చేరిన గదులతో
విద్యార్థుల అవస్థలు

చదువులు ఎలా..?