దందా సాగుతోంది ఇలా.. | - | Sakshi
Sakshi News home page

దందా సాగుతోంది ఇలా..

Jan 16 2025 8:04 AM | Updated on Jan 16 2025 8:03 AM

ఏపీకి చెందిన గొలుసు కట్టు వ్యాపారులు ఐబీసీసీ పేరుతో గద్వాలకు చెందిన యువతను లక్ష్యంగా చేసుకొని వారి నుంచి రూ.10వేలు చెల్లించి సభ్యునిగా చేర్చుకుంటున్నారు. అతను మరో నలుగురు యువకులకు సభ్యత్వం ఇప్పించేలా దందా కొనసాగింది. ఈ నిర్వహణపై మీడియాలో కథనాలు సైతం వచ్చాయి. చర్యలు మాత్రం శూన్యంగా మారింది. గోల్డ్‌ స్కీంలు, గంధం చెట్ల పెంపకం ఇలా.. ఎన్నో స్కీంలు కొనసాగుతున్నాయి. అయితే ఈ దందాలపై గద్వాల, అయిజ పోలీసు స్టేషన్‌లో కేసులు నమోదు కాగా కొన్ని కేసులు సీఐడీకి బదిలీ అయ్యాయి. తాజాగా స్టాక్‌ మార్కెట్‌, రూ.లక్షలకు రూ. 40వేలు, రూ. 12వేలు పేడితే రూ.48 వేలు ఆదాయం వస్తుందని చేప్పే స్కీంలు వెలుగులోకి వచ్చాయి. అయితే, జిల్లాలో ఇలాంటి స్కీంలపై ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోకపోగా.. తమకేందుకులే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. దీనికితోడు జరిగిన మోసంపై పోలీసులను ఆశ్రయించినా సీవిల్‌ కేసుగా సూచిస్తూ కోర్టు ద్వారా పరిష్కారం చేసుకోవాల్సిందిగా అధికారులు చెబుతున్నారు. ఇలాంటి చిక్కుముడులు నేపథ్యంలో గొలుసుకట్టు స్కీంలకు అడ్డుకట్ట పడడం లేదని బాధితులు చెబుతున్నారు. మరోవైపు పోలీసులు బాధితులపై కంటే నిందితుల పట్ల కనికరం కనబరుస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement