మూడో విడత నామినేషన్లు షురూ
నామినేషన్ల వివరాలు
కాటారం: గ్రామపంచాయతీ ఎన్నికలల్లో భాగంగా బుధవారం నుంచి మూడో విడత నామినేషన్లు ప్రారంభమయ్యాయి. కాటారం సబ్ డివిజన్ పరిధిలోని కాటారం, మహదేవపూర్, మహాముత్తారం, మల్హర్ మండలాల్లో నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం కొనసాగింది. మొదటి రోజు సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు అంతంత మాత్రంగానే నామినేషన్లు నమోదయ్యాయి. నాలుగు మండలాల్లో 81 సర్పంచ్ స్థానాలకు 106 నామినేషన్లు, 696 వార్డులకు 175 నామినేషన్లు దాఖలైనట్లు ఆయా మండలాల ఎంపీడీఓలు తెలిపారు. కాటారం మండలంలో 24 గ్రామపంచాయతీలకు సంబంధించి అధికారులు 9 క్లస్టర్లను ఏర్పాటు చేసి నామినేషన్లు స్వీకరించారు. మహదేవపూర్‌లో 18 గ్రామపంచాయతీలకు గాను ఐదు క్లస్టర్లు, మహాముత్తారం మండలంలోని 24 గ్రామపంచాయతీలకు గాను 6 క్లస్టర్లు, మల్హర్ మండలంలో 15 గ్రామపంచాయతీలకు గాను 5 క్లస్టర్లును అధికారులు ఏర్పాటు చేయగా అభ్యర్థులు నామినేషన్లు అందజేశారు. కాటారంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రంలో రాత్రి 7గంటల వరకు నామినేషన్ ప్రక్రియ కొనసాగింది. సమయం ముగిసినప్పటికీ అభ్యర్థులు సమయానికి ముందుగానే కేంద్రంలోకి రావడంతో అధికారులు నామినేషన్ స్వీకరించారు. మహదేవపూర్ మండలం ఎలికేశ్వరం, అంబట్‌పల్లి క్లస్టర్ల నామినేషన్ కేంద్రాలను సాధారణ ఎన్నికల పరిశీలకులు ఫణీంద్రరెడ్డి, కాటారం మండలం కొత్తపల్లి నామినేషన్ కేంద్రాన్ని కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్ పరిశీలించారు. నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్న తీరు, ఏర్పాట్లు, సౌకర్యాలపై ఆరా తీశారు. నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నామినేషన్ కేంద్రాల వద్ద ఎలాంటి అలర్లు జరగకుండా డీఎస్పీ సూర్యనారాయణ ఆధ్వర్యంలో సీఐలు, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది బందోబస్తు చర్యలు నిర్వహించారు.
మండలం జీపీ సర్పంచ్ వార్డులు నామినేషన్లు
కాటారం 24 34 210 68
మహదేవపూర్ 18 20 162 41
మహాముత్తారం 24 22 192 19
మల్హర్ 15 30 128 47
తొలిరోజు సర్పంచ్‌కు 106,
వార్డు స్థానాలకు 175 నామినేషన్లు
మూడో విడత నామినేషన్లు షురూ
మూడో విడత నామినేషన్లు షురూ


