కొనుగోళ్లు పారదర్శకంగా నిర్వహించాలి
మల్హర్: రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు పారదర్శకంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్ ఆదేశించారు. బుధవారం మండలంలో రుద్రారం, ఎడ్లపల్లి, కొయ్యూ రు, కొండంపేట్, వల్లెకుంట, తాడిచర్ల గ్రామాల్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సెంటర్ నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ రైతుల నుంచి ఎఫ్‌ఏక్యూ గ్రేడ్ ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ట్యాగ్ చేసిన రైస్ మిల్లులకు తరలించాలన్నారు. అ లాగే కొనుగోలు కేంద్రాల్లో రోజువారీగా కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు, చెల్లింపుల పురోగతి ట్యాబ్‌లో నమోదు చేయాలన్నారు. రైతులకు అవసరమైన మౌలిక వసతులు తాగునీరు, నీడ, కొలతల యంత్రాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. డీసీఎస్‌ఓ కిరణ్‌కుమార్, తహసీ ల్దార్ రవికుమార్, మండల వ్యవసాయ అధికారి శ్రీజ, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు.


