నామినేషన్ కేంద్రాల పరిశీలన
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం అంబట్‌పల్లి క్లస్టర్లలోని నామినేషన్ కేంద్రాలను గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా జిల్లా ఎన్నికల అబ్జర్వర్ ఫణీంద్రరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. బుధవారం మొదటిరోజు నామినేషన్ కేంద్రంలో సర్పంచ్, వార్డు సభ్యులకు పోటీ చేసే అభ్యర్థుల నుంచి నామినేషన్ పత్రాలు స్వీకరిస్తున్న తీరును రిటర్నింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఎంపీడీఓ రవీంద్రనాథ్, ఎంపీఓ భవాని, ఏపీఓ సునీత తదితరులు ఉన్నారు.
ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి
పలిమెల: గ్రామ పంచాయతీ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని ఎన్నికల పరిశీలకులు ఫణీంద్రరెడ్డి అధికారులను ఆదేశించారు. మండలకేంద్రంలో నామినేషన్ కేంద్రాలను పరిశీలించారు. ఆర్ ఓ, ఏఆర్‌ఓలతో నామినేషన్ పత్రాల పరిశీలన, రికా ర్డుల నిర్వహణ, నమోదు అభ్యర్థులకు అందించే మార్గదర్శకాలను అడిగి తెలుసుకున్నారు. ఎంపీడీ ఓ సాయి పవన్, ఎస్సై రమేష్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


