అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో ఆస్పత్రి భవనాల నిర్మాణాల పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ రాహుల్‌శర్మ తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో పంచాయతీరాజ్, టీజీఈడబ్ల్యూఐడీసీ, ప్రణాళికశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆస్పత్రుల నిర్మాణాలకు స్థల సమస్య ఉంటే కాటారం సబ్ కలెక్టర్, భూపాలపల్లి ఆర్డీఓకు నివేదికలు అందించాలన్నారు. వైద్య కళాశాలల్లో రూ.75 లక్షల వ్యయంతో చేపడుతున్న అదనపు తరగతి గదుల భవనం త్వరగా పూర్తి చేసి వినియోగంలోకి తేవాలన్నారు. జిల్లా ప్రధాన ఆస్పత్రిలో సిబ్బంది సమయపాలన పాటించాలని, పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరం చేయాలని సూచించారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కొనసాగుతున్న నిర్మాణ పనులను పూర్తి చేయాలని కలెక్టర్ రాహల్‌శర్మ ఆదేశించారు. సివిల్ పనులు, భవిత కేంద్రాలు నిర్వహణ, మరుగుదొడ్లు, చిల్డ్రన్స్ విత్ స్పెషల్ నీడ్స్ సదుపాయాలు, కేజీబీవీలు, మోడల్ పాఠశాలల అభివృద్ధి పనులు, ఇతర అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, స్థానిక సంస్థల ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్, సీపీఓ బాబురావు, టీజీఈడబ్ల్యూఐడీసీ ఈఈ అరుణ్‌కుమార్, పీఆర్ ఈఈ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో
ముందుకు సాగాలి
భూపాలపల్లి రూరల్: దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం ఐడీఓసీ కార్యాలయంలో మహిళా, శిశు, వయోవృద్ధుల దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి అఖిల, ఎస్పీ సంకీర్త్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దివ్యాంగుల అభివృద్ధికి ప్రభుత్వం అన్ని రకాల సహకారాలు అందిస్తోందన్నారు. ఇటీవల అంబేడ్కర్ స్టేడియంలో నిర్వహించిన క్రీడాపోటీల్లో ప్రతిభ కనబర్చిన వారికి ప్రశంసపత్రాలు అందించారు. అలాగే జడ్జి అఖిల, ఎస్పీ సంకీర్త్ మాట్లాడుతూ దివ్యాంగులు అనేక రంగాల్లో ప్రతిభ కనబర్చి ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, మహిళా సంక్షేమ అధికారి మల్లేశ్వరి, డీఈఓ రాజేందర్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ మధుసూదన్, డీఆర్డీఓ బాలకృష్ణ, మెప్మా పీడీ రాజేశ్వరి, హెచ్‌ఎంఆర్టీ సంస్థ అధ్యక్షురాలు రజిత, ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ అధ్యక్షుడు అయిలి మారుతి, పారా ఒలంపిక్స్ జిల్లా అధ్యక్షుడు కుమారస్వామి, తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్‌శర్మ


