
రోడ్లు నిర్మించాలి
పాత కలెక్టరేట్‌కు ఎదురుగా మంజూర్‌నగర్‌లోని వెంకటేశ్వర్ల కాలనీలో రోడ్లు లేక అవస్థలు పడుతున్నాం. ఐదారేళ్లుగా ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నా ప్రభుత్వపరంగా అభివృద్ధి చేయడం లేదు. మొయిన్‌రోడ్డు నుంచి కొంత దూరం మాత్రమే రోడ్డు వేసి వదిలేశారు. మిగతా లైన్లలో ఇప్పటి వరకు మున్సిపల్ అధికారులు సౌకర్యాలు కల్పించడం లేదు. మిషన్ భగీరథ పైప్‌లైన్ ఏర్పాటు చేసి వదిలేశారు. నీళ్లు మాత్రం రావడం లేదు. నూతన బోరుబావులను వెసుకోవడంతో సుమారు. రూ.2 లక్షల వరకు అదనపు ఖర్చు అవుతుంది. విద్యుత్ దీపాలు సక్రమంగా వెలగడం లేదు.
– ఉప్పుల శ్రీనివాస్,
మంజూర్‌నగర్, వెంకటేశ్వరకాలనీ
నిధులు కేటాయించాలి
మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా ఏర్పడుతున్న కాలనీల అభివృద్ధికి నిధులు కేటాయించాలి. నిధులు కేటాయించి ప్రజలకు కావాల్సిన అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఇంటి పన్ను, ఇతర పన్నుల పేరుతో మున్సిపల్ అధికారులు వేలాది రూపాయల రుసుం తీసుకుంటున్నారు. కానీ కాలనీల ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు మాత్రం కల్పించడం లేదు.
– సల్ల సంపత్, మంజూర్‌నగర్

రోడ్లు నిర్మించాలి