
6న ఆర్టీసీ విహారయాత్ర సర్వీసులు ప్రారంభం
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో పుణ్యక్షేత్రాల విహారయాత్ర సర్వీసులను ప్రారంభించనున్నట్లు భూపాలపల్లి ఆర్టీసీ డిపో మేనేజర్ ఇందు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 6న భూపాలపల్లి డిపో నుంచి రామప్ప, లక్నవరం, బొగత జలపాతాలు సందర్శించేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఉదయం ఆరు గంటలకు భూపాలపల్లి డిపో నుంచి బస్సు ప్రారంభమవుతుందని, ఒకరోజు ప్యాకేజీకి గాను పెద్దలకు రూ.460, పిల్లలకు రూ.250 చార్జీలు ఉంటాయని ఆమె పేర్కొన్నారు. ఈ యాత్ర ద్వారా పర్యాటకులకు ఆధ్యాత్మికతతో పాటు ప్రకృతి సౌందర్యాన్ని అనుభవించే అవకాశం లభిస్తుందని వెల్లడించారు.
జిల్లా పౌర సరఫరాల అధికారి బదిలీ
భూపాలపల్లి రూరల్: జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనాథ్ పెద్దపల్లి జిల్లాకు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా గురువారం కలెక్టర్ కార్యాలయంంలో రెవెన్యూశాఖ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, డీఎం రాములు, పౌర సరఫరాల శాఖ కార్యాలయ సిబ్బంది ఆయనను సన్మానించి వీడ్కోలు పలికారు. అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు, రేషన్ బియ్యం సరఫరా వంటి కీలక అంశాల్లో శ్రీనాథ్ అంకితభావంతో పనిచేశారని కొనియాడారు. జిల్లాలో ఆయన చేసిన సేవలు గుర్తుండిపోతాయని తెలిపారు. ఈయన స్థానంలో నిర్మల్ జిల్లా నుంచి డీసీఎస్‌ఓగా కిరణ్‌కుమార్ బదిలీపై రానున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
చిన్న కాళేశ్వరం
పనుల అడ్డగింత
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కేంద్రంలోని ఎర్రచెరువు మీదుగా సర్వే చేస్తున్న మెయిన్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్ పనులను స్థానికులు గురువారం అడ్డుకున్నారు. రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలు సంయుక్తంగా సర్వే జరుపుతుండగా రైతులు, ప్రజలు అడ్డుకొని కెనాల్ నిర్మాణం వద్దని అధికారులతో తేల్చిచెప్పారు. దీంతో అధికారులు వెనుదిరిగారు. తహీసీల్దార్ రామారావు, డీటీ కృష్ణ, ఏఈ భరత్ తదితరులు ఉన్నారు.
రైతులకు అందుబాటులో ఎరువులు
భూపాలపల్లి రూరల్: జిల్లాలోని రైతులకు ఎరువులు పూర్తిగా అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యవసాయ శాఖ ఇన్‌చార్జ్ అధికారి బాబు గురువారం ప్రకటనలో పేర్కొన్నారు. రైతులు ఇబ్బందులు ఎదుర్కోకుండా వ్యవసాయ శాఖ అవసరమైనంత ఎరువులను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. రైతులు తమ ఖర్చులను తగ్గించుకోవడానికి ఎరువుల వినియోగాన్ని సరైన మోతాదులో వేసుకోవాలన్నారు. ఎరువుల సరఫరా సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే స్థానిక వ్యవసాయ అధికారులకు లేదా మండల వ్యవసాయ కార్యాలయాన్ని సంప్రదించాలని ఆయన సూచించారు.
గురుకులం
ప్రిన్సిపాల్‌కు డాక్టరేట్
కాటారం: మండలకేంద్రంలోని తెలంగాణ గిరిజన గురుకుల సంక్షేమ బాలికల కళాశాల ప్రిన్సిపాల్ నాగలక్ష్మి గురువారం పీహెచ్‌డీ డాక్టరేట్ పట్టా పొందారు. నాగలక్ష్మి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సీటీ హైదరాబాద్‌లో గణిత విభాగంలో ఏ స్టడీ ఆఫ్ సర్టెన్ క్లాస్ ఆఫ్ యూనివలెంట్ హార్మోనిక్ ఫంక్షన్స్ అండ్ రిలేటెడ్ సబ్ క్లాసెస్ అనే అంశంపై పరిశోధన చేశారు. విశ్రాంత ఆచార్యులు వి.శ్రీనివాస్ ఆధ్వర్యంలో పరిశోధన చేసి సమర్పించిన సిద్ధాంత గ్రంథానికి పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య బి.శ్రీనివాస్ డాక్టరేట్ ప్రకటించినట్లు నాగలక్ష్మి తెలిపారు. నాగలక్ష్మి డాక్టరేట్ పొందడం పట్ల విశ్వవిద్యాలయ గణితశాస్త్ర ఆచార్యులు, గురుకులం భూపాలపల్లి ఆర్‌సీఓ హరిసింగ్, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది అభినందనలు తెలిపారు.

6న ఆర్టీసీ విహారయాత్ర సర్వీసులు ప్రారంభం

6న ఆర్టీసీ విహారయాత్ర సర్వీసులు ప్రారంభం