
అధిక ఫీజులను నియంత్రించాలి
భూపాలపల్లి రూరల్: ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజులను నియంత్రించాలని ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్తూరు రవీందర్ డిమాండ్ చేశారు. ఆ పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన సమావేశంలో రవీందర్ మాట్లాడారు. విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయకపోవడంతో ప్రైవేట్ స్కూలు యజమాన్యాలు మితిమీరిన ఫీజులు వసూలు చేస్తున్నాయని ఆరోసించారు. స్కూళ్లలో యూనిఫామ్స్, బుక్స్ అత్యధిక ధరలకు అమ్మకుండా చూడాలన్నారు. ప్రభుత్వ పాఠశాలకు ప్రభుత్వమే ఉచిత బస్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.