
మూడు నెలల బియ్యం పంపిణీ పూర్తి
భూపాలపల్లి: వర్షాకాలం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసిన మూడు నెలల బియ్యం సరఫరా సోమవారంతో ముగిసింది. జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన బియ్యాన్ని జిల్లాలో 1,25,588 కార్డుదారులకు గాను 1,08,492(86.38 శాతం) మంది తీసుకున్నారు. జిల్లావ్యాప్తంగా 6356.524 మెట్రిక్ టన్నుల (89.6 శాతం) బియ్యాన్ని పంపిణీ చేశారు.
4,520 కొత్త కార్డుల మంజూరు..
కొత్త తెల్ల రేషన్ కార్డుల ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది. మీ సేవా ద్వారా ఆన్‌లైన్‌లో కొత్త కార్డుల మంజూరు కోసం మొత్తం 9,362 దరఖాస్తులు రా గా అధికారులు ఇప్పటివరకు 4,520 దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులైన 4,396 మందికి కార్డులు మంజూరు చేసినట్లు పౌరసరఫరాల అధికారులు వెల్లడించారు. కుటుంబ సభ్యుల మార్పులు, చేర్పుల కోసం 16,803 దరఖాస్తులు రాగా 14,377 దరఖాస్తులను పరిష్కరించారు.
దళారులను ఆశ్రయించొద్దు
కొత్త రేషన్‌కార్డుల మంజూరు కోసం మధ్యవర్తి లేదా దళారులను ఆశ్రయించొద్దు. అర్హులైన వారందరికీ కార్డులు మంజూరవుతాయి. చట్ట వ్యతిరేక పనులు చేసే వారిపై చర్యలు తప్పవు. రేషన్‌కార్డుల జారీ ప్రక్రియలో ఏమైనా సందేహాలు ఉంటే తహసీల్దార్ కార్యాలయంలో గానీ, జిల్లా పౌర సరఫరాల అధికారి కార్యాలయం, కలెక్టరేట్‌లో సంప్రదించాలి.
– అశోక్‌కుమార్, అదనపు కలెక్టర్
బియ్యం తీసుకున్న
లబ్ధిదారులు 86.38 శాతం
కొనసాగుతున్న
కొత్త కార్డుల మంజూరు ప్రక్రియ

మూడు నెలల బియ్యం పంపిణీ పూర్తి