
ఆపరేషన్ ముస్కాన్‌ను విజయవంతం చేయాలి
భూపాలపల్లి: బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్–11 కార్యక్రమాన్ని సంబంధిత శాఖల అధికారులు సమష్టిగా విజయవంతం చేయాలని ఎస్పీ కిరణ్ ఖరే సూచించారు. ఆపరేషన్ ముస్కాన్–11 కార్యక్రమంలో భాగంగా మంగళవారం వివిధ శాఖల అధికారులతో జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... తప్పిపోయిన పిల్లలను గుర్తించి, వారిని రక్షించి, పునరావాసం కల్పించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పని ప్రదేశంలో ఉన్న పిల్లలను పోలీసు బృందాలు, వివిధ శాఖల సమన్వయంతో దాడులు నిర్వహించి, పిల్లలను పనిలో పెట్టుకునే యజమానులపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. బాల కార్మికులు కనిపిస్తే వెంటనే 100 లేదా 1098కు డయల్ చేయాలని సూచించారు. స్ధానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. కార్యక్రమ వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎ.నరేష్‌కుమార్, డీడబ్ల్యూఓ మల్లీశ్వరి, సీడబ్ల్యూసీ వెల్ఫేర్ కమిటీ మెంబర్ దామోదర్, అసిస్టెంట్ లేబర్ కమిషనర్ వినోద, డీసీసీబీ, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్లు రమేష్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
ఎస్పీ కిరణ్ ఖరే