
కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు
కాటారం: కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. కాటారం డివిజన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలకు సీఎస్‌ఆర్ నిధుల ద్వారా సమకూర్చిన 600 డెస్క్ బెంచీలను కాటారం మండలకేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం మంత్రి పంపిణీ చేశారు. పాఠశాలలో లైబ్రరీని ప్రారంభించారు. అనంతరం మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ విద్యార్థులకు ఉచితంగా యూనిఫాం, పుస్తకాలు, నోట్‌బుక్కులు అందజేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు, ఉపాధ్యాయులను సంక్రాంతి, దసరా సెలవుల్లో హైదరాబాద్, ఢిల్లీ లాంటి నగరాలకు తీసుకెళ్లే కార్యక్రమం చేపడుతామన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థుల సంఖ్య, హాజరుశాతం పెంచేందుకు కృషిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్‌శర్మ, సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్, డీఈఓ రాజేందర్, ఎంఈఓ శ్రీదేవి పాల్గొన్నారు.
పార్టీ బలోపేతం దిశగా చర్యలు..
కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా అధిష్టానం చర్యలు తీసుకుంటుందని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. కాటారం మండలకేంద్రంలో మండల సంస్థాగత ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. మంత్రి శ్రీధర్‌బాబుతో పాటు ట్రేడ్ ప్రమోషన్ కమిషన్ చైర్మన్ ఐత ప్రకాశ్‌రెడ్డి, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి, జిల్లా పరిశీలకులు లింగాజీ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్థానిక సంస్థలకు త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయని వేలాది మంది కార్యకర్తలకు పదవులు దక్కే అవకాశం ఉందన్నారు. ఈ సమావేశంలో యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు చీమల సందీప్, మండల అధ్యక్షుడు వేమునూరి ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య, యూత్ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ పాల్గొన్నారు.
రవాణా సౌకర్యం మొరుగు
మల్హర్: గ్రామీణా ప్రాంతం నుంచి జిల్లా కేంద్రానికి రవాణా వ్యవస్థను మెరుగుపరిచి, మండల ప్రజలకు జిల్లా కేంద్రాన్ని మరింత దూరభారం తగ్గిస్తామని ఐటీ, పరిశమ్రల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. మండలంలోని పెద్దతూండ్ల కిషన్‌రావుపల్లి అటవీ ప్రాంతం నుంచి భూపాలపల్లి వన్‌ఇంక్లయిన్ మైన్ వరకు రూ. 4.70 కోట్లతో నిర్మించే రోడ్డును శుక్రవారం మంత్రి శ్రీధర్‌బాబు భూమి పూజ నిర్వహించారు. తాడిచర్ల పాత గ్రామ పంచాయతీలో చిల్డ్రన్ పార్కును శ్రీధర్‌బాబు ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాడిచర్ల 132/33కేవీలైన్ సబ్‌స్టేషన్ ఏర్పాటుకు సన్నాహలు చేస్తున్నామన్నారు. కొయ్యూరు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ రిపేర్ సెంటర్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించామని, త్వరలోనే తీసుకువస్తామని వివరించారు. పెద్దతాడిచర్ల డేంజర్ జోన్ సమస్య త్వరలోనే పరిష్కరిస్తామని హమీఇచ్చారు. ఈ కార్యక్రమంలో ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాశ్‌రెడ్డి, కలెక్టర్ రాహుల్‌శర్మ, అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, పీఏసీఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య పాల్గొన్నారు.
సైనికుల్లా పనిచేయాలి
గ్రామస్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలపడేందుకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. తాడిచర్లలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బడితెల రాజయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి మంత్రి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాశ్‌రెడ్డి, మండల అధ్యక్షుడు బడితెల రాజయ్య, మాజీ ఎంపీపీ మల్హల్‌రావు, అయిత రాజిరెడ్డి, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు దండు రమేశ్ పాల్గొన్నారు.
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి
శ్రీధర్‌బాబు