
ధర్మకంచలో పట్టపగలే చోరీ
జనగామ: జిల్లా కేంద్రం ధర్మకంచ ప్రధాన రహదా రిలో పట్టపగలే భారీ చోరీ సంఘటన శుక్రవారం జరిగింది. బాధితురాలి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ధర్మకంచకు చెందిన అంగన్‌వాడీ టీచర్ మంగోలు రేణుక ఉదయం 9.30 గంటలకు సెంటర్‌కు వెళ్లి.. రాత్రి 7 గంటలకు తిరిగి ఇంటికి చేరుకుంది. ముఖద్వారం తలుపులు తెరిచి ఉన్నా యి. లోపలికి వెళ్లి చూడగా రెండు బీరువాలు పగుల గొట్టి ఉండడంతో వెంటనే 100 నంబర్‌కు డయల్ చేసి సమాచారం ఇచ్చారు. పోలీసులు చేరుకుని క్లూస్ టీంలను రప్పించారు. సుమారు 12 తులాల బంగారు ఆభరణాలు, 60 తులాల వెండి వస్తువులు(కాళ్ల కడియాలు, పట్టా గొలుసులు), రూ.60వేల నగదు అపహరణకు గురైనట్లు రేణుక తెలిపారు. కూతురు పెళ్లి కోసం భద్రపరిచిన నగలు, నగదు చోరీకి గురి కావడంతో బాధితురాలు కన్నీరు మున్నీరుగా విలపించింది. పోలీసులు విచారణ ప్రారంభించారు.
12 తులాల బంగారు, 60 తులాల వెండి ఆభరణాల అపహరణ
రూ.60వేల నగదు కూడా..

ధర్మకంచలో పట్టపగలే చోరీ