
కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తున్న బీజేపీ
కరీంనగర్: కేంద్రంలో మూడోసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోదీ అవినీతికి పాల్పడ్డ వారికి అండగా ఉంటూ కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తున్నారని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు. శనివారం కరీంనగర్‌లోని బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అవినీతి పరులు విదేశాల్లో డ్యాన్స్‌లు చేస్తుంటే మోదీ ప్రభుత్వం, రాజ్యాంగం, చట్టాలు ఏం చేస్తున్నట్లు అని ప్రశ్నించారు. ఆపరేషన్ కగార్ పేరుతో దుర్మార్గపు చర్యలకు పాల్పడుతుందని, సమాజం కోసం పోరాడుతున్న వారిని హతమార్చడం అన్యాయమని అన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు గడిచిందని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన పేదలకు అందించాల్సి అవసరముందన్నారు. అర్హులైన వారందరికీ ఇండ్లు ఇవ్వాలని ఈనెల 15లోపు జిల్లాలోని అన్ని నియోజక వ ర్గాల శాసన సభ్యులకు వినతిపత్రాలు అందిస్తామ ని తెలిపారు. ఈ సమావేశంలో కార్యవర్గ, కౌన్సిల్ సభ్యులు బోయిని అశోక్, కసిరెడ్డి సురేందర్‌రెడ్డి, టేకుమల్ల సమ్మయ్య, పైడిపల్లి రాజు, బ్రామండ్లపెల్లి యుగేందర్ తదితరులు పాల్గొన్నారు.