
మసీదుకు స్థలం కేటాయించండి
నూకపెల్లి అర్బన్ హౌసింగ్ కాలనీలో మసీదు నిర్మాణానికి స్థలం కేటాయించండి. ఇళ్లు పొందిన ముస్లిం కుటుంబాలు ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా కాలనీ పరిసరాల్లో మసీదుకు స్థలం కేటాయించండి.
– మహ్మద్ అబ్దుల్ భారీ, ముస్లిం సదర్
ప్లాట్లు కబ్జా చేస్తున్నారు
మాది వెల్గటూర్ మండలం మొక్కట్రావుపేట. 97 ఇళ్లు ఎల్లంపల్లిలో ముంపునకు గురయ్యా యి. ప్రభుత్వం కొంతమందికి ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో ప్లాట్లు కేటాయించింది. 2015 నాటికి 18ఏళ్లు నిండిన యువతకు ప్లాట్లు, డబ్బులు ఇవ్వాల్సి ఉన్నా ఇప్పటివరకు రాలేదు. ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో మిగిలిన ప్లాట్లను కొందరు కబ్జా చేస్తూ గుడిసెలు వేస్తున్నారు. వాటిని తొలగించి లబ్ధిదారులమైన మాకు అప్పగించండి.
– ఎల్లంపల్లి ప్రాజెక్టు బాధితులు,
ముక్కట్రావుపేట
అసంపూర్తి రోడ్డుతో ప్రమాదాలు
మల్యాల బ్లాక్ ఆఫీస్ నుంచి పెగడపెల్లి వరకు ప్రారంభించిన రోడ్డు పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. కంకర, డస్ట్ పోసి వదిలేశారు. దుమ్ము కొట్టుకొచ్చి ఇళ్లలోకి చేరుతోంది. రోడ్డుపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.
– మల్యాల గ్రామ ప్రజలు

మసీదుకు స్థలం కేటాయించండి

మసీదుకు స్థలం కేటాయించండి