
హద్దు రాళ్లు తొలగిస్తున్నారు
జిల్లాకేంద్రంలోని ఎల్‌ఎల్ గార్డెన్ నుంచి ధన్వంతరి ఆలయానికి వెళ్లే దారిలోని సర్వేనంబర్ 1429లోగల 8.05 ఎకరాలకు హద్దురాళ్లను కొందరు తొలగిస్తున్నారు. మా తాత అంగడి భూమయ్య నుంచి వారసత్వంగా వచ్చిన భూమికి హద్దు రాళ్లు తొలగిస్తున్న వారిపై చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయండి.
– అంగడి రాజు, మేడిపల్లి
బకాయిలు చెల్లించాలంటున్నరు
బెస్ట్ అవైలబుల్ స్కూళ్లలో చదువుతున్న మా పిల్లలను యాజమాన్యాలు అనుమతించడం లేదు. ఫీజు బకాయిలు చెల్లించాలంటున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. సమస్యను ప్రభుత్వానికి నివేదించి మా పిల్లల చదువుకు ఆటంకం కలగకుండా చూడండి.
– బీఏఎస్ స్కూల్స్ విద్యార్థుల పేరెంట్స్
ఇంట్లోకి నీరు వస్తోంది
యావర్‌రోడ్డులో డ్రైనేజీ సరిగా లేక చిన్నపాటి వర్షానికే మురుగు నీరు ఇంట్లోకి చేరుతోంది. వర్షం వస్తోందంటేనే భయబ్రాంతులకు గురవుతున్నం. డ్రైనేజీని సరిచేసి ఇళ్లలోకి నీరు రాకుండా చర్యలు తీసుకోండి.
– అక్కినపెల్లి కాశీనాథం,
యావర్‌రోడ్డు జగిత్యాల

హద్దు రాళ్లు తొలగిస్తున్నారు

హద్దు రాళ్లు తొలగిస్తున్నారు