
మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం చేయూత
జగిత్యాలరూరల్: మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం చేయూతనందిస్తోందని జిల్లా సెర్ఫ్ ఏపీడీ సునీత అన్నారు. శుక్రవారం స్వశక్తి సంఘాల సభ్యులు ఏర్పాటు చేసుకున్న టీ, టిఫిన్, బిర్యానీ సెంటర్, చల్‌గల్‌లో పీఎంఎఫ్‌ఎంజీ ద్వారా ఏర్పాటు చేసిన పిండిగిర్ని, చల్‌గల్‌లో వీవోఏల ద్వారా ఉల్లాస్ టాస్ ఆన్‌లైన్ సర్వేను పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఇందిర మహిళ శక్తి పథకం ద్వారా సీ్త్రనిధి రుణాలు, బ్యాంక్ లింకేజీ రుణాలు అందించడం జరుగుతుందన్నారు. ప్రతీ మహిళా సభ్యురాలు రుణాలు తీసుకుని స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేసుకుని ఆర్థికాభివృద్ధి సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాన్‌ఫామ్ డీపీఎం వెంకటేశ్, ఏపీఎం గంగాధర్, సీసీ గంగారాం, వీవోఏలు లౌక్య, విజయ, యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.