
టీబీ బాధితులు జాగ్రత్తలు పాటించాలి
ధర్మపురి: టీబీ లక్షణాలున్న వారు జాగ్రత్తలు తీసుకోవాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్ అన్నారు. మండలంలోని నేరెళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం టీబీ బాధితులకు శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఇంపాక్ట్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరాన్ని శ్రీనివాస్ సందర్శించారు. టీబీ లక్షణాలున్నవారు ప్రతినెలా నిర్ధారణ పరీక్షలు చేసుకోవాలని సూచించారు. వారు తీసుకోవాల్సిన ఆహార అలవాట్లపై వివరించారు. ముఖ్యంగా మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని తెలిపారు. మండల వైద్యాధికారులు శివకుమార్, అస్మాతరుణుం, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ శ్రీనివాస్, హెచ్‌ఈవో సతీష్‌కుమార్, ఆరోగ్య పర్యవేక్షకులు తదితరులున్నారు.