
మత్తుతో భవిష్యత్ అంధకారం
మెట్‌పల్లి: మత్తు పదార్థాలకు అలవాటు పడితే యువత భవిష్యత్ అంధకారం అవుతుందని మెట్‌పల్లి మేజిస్ట్రేట్ నాగేశ్వర్‌రావు అన్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా పట్టణంలోని మనోహార్ గార్డెన్‌లో గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. పలు పాఠశాలల విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మేజిస్ట్రేట్ మాట్లాడుతూ విద్యార్థి దశలో చదువుపై దృష్టి పెట్టి అనుకున్న లక్ష్యాలను సాధించాలన్నారు. డీఎస్పీ రాములు మాట్లాడుతూ మత్తు పదార్థాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని, వినియోగించినా.. విక్రయించినా పోలీసులకు సమాచారం అందించాలన్నారు. కార్యక్రమంలో ఎకై ్సజ్ సీఐ వినోద్‌కుమార్, ఎస్సై కిరణ్‌కుమార్, ఎంఈఓ చంద్రశేఖర్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు కంతి మోహన్‌రెడ్డి తదితరులున్నారు.
సమైక్య సంఘాలతో మహిళల ఆర్థికాభివృద్ధి
మల్లాపూర్: సమైక్య సంఘాలతో మహిళలు ఆర్థికంగా వృద్ధి చెందుతారని సెర్ప్ ప్రాజెక్టు మేనేజర్ భారతి అన్నారు. మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో కొత్తగా ఎన్నికై న గ్రామసంఘాల పదాధికారులు, అధ్యక్ష, కార్యదర్శులు, కోశాధికారులకు శిక్షణ ఇచ్చారు. మహిళా సంఘాల కుటుంబాలను పేదరికం నుంచి బయటకు తేవాలన్నారు. శిక్షణలో ఏపీఎం రమ, సమాఖ్య అధ్యక్షురాలు సత్తెమ్మ, ఐకేపీ ఏపీఎం దేవరాజ్, సీసీలు, తదితరులు పాల్గొన్నారు.
ఆషాఢమాసంలో విశ్వ బ్రాహ్మణుల తొలి బోనాలు
గొల్లపల్లి: ఆషాఢమాసం పురస్కరించుకుని మండల కేంద్రంలో విశ్వబ్రాహ్మణులు పోచమ్మ (పోలేరమ్మ) అమ్మవారికి గురువారం తొలిబోనాలు సమర్పించారు. విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు శ్రీకోటీ భూమయ్య, దేవరకొండ శ్యామ్‌సుందర్, మారియో, ఎదులాపురం భాస్కరాచార్య, గణేశ్, కరుణాకర్‌కుమార్, నిరంజన్, రాజన్న, చారి, మహిళలు పాల్గొన్నారు.
టీఎన్జీవో రాష్ట్ర కార్యదర్శిగా చంద్రశేఖర్
మల్యాల: టీఎన్జీఓ రాష్ట్ర కార్యదర్శిగా మండలంలోని ముత్యంపేటలోగల కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ పర్యవేక్షకులు ఉపాధ్యాయుల చంద్రశేఖర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు ముజీబ్ చంద్రశేఖర్‌ను పూలమాలతో సన్మానించారు. కరీంనగర్, జగిత్యాల జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు దారం శ్రీనివాస్ రెడ్డి, సంగెం లక్ష్మణ్‌రావు, నాగేందర్ రెడ్డి, అమరేందర్ రెడ్డి, నాయకులు రాగి శ్రీనివాస్, నరసింహస్వామి, ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.
వాహనాలు నడుపుతున్న 35మంది మైనర్ల పట్టివేత
మెట్‌పల్లి: పట్టణంలో ఎస్సై కిరణ్‌కుమార్ తన సిబ్బందితో గురువారం వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా 35మంది మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వారి వాహనాలను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మైనర్లు వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణమైతే వారి తల్లిదండ్రుల పై కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఎస్సై తెలిపారు. మొదటిసారి పట్టుబడిన మైనర్లతోపాటు వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తామని, రెండోసారి పట్టుబడితే తల్లిదండ్రులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

మత్తుతో భవిష్యత్ అంధకారం

మత్తుతో భవిష్యత్ అంధకారం

మత్తుతో భవిష్యత్ అంధకారం