
వాట్సాప్ గ్రూపుల్లో పెట్టాలి
వాతావరణానికి సంబంధించిన ముందస్తు సమాచారం ఉపయోగపడుతోంది. వర్షం వస్తుందనే సమాచారం ఉంటే ఎరువులు వేయడం మానేస్తాం. ధాన్యం ఆరబెడితే వెంటనే కవర్లు కప్పుకుంటున్నాం. పంటలకు సాగు నీటిని ఇవ్వడం బంద్ చేస్తాం. సమాచారాన్ని వాట్సాప్ గ్రూపుల్లో కూడా ఇస్తే బాగుంటుంది.
– కాటిపెల్లి గంగారెడ్డి, రాయికల్
వారంలో రెండు రోజులు
ప్రతి మంగళ, శుక్రవారాల్లో వాతావరణానికి సంబంధించి ప్రత్యేక బులెటిన్‌ను మీడియాకు విడుదల చేస్తున్నాం. ప్రతిరోజు వాతావరణ కేంద్రంలోని పరిస్థితులను రెండు సార్లు సేకరించి వాతావరణ కేంద్రం వెబ్‌సైట్లో పొందుపర్చుతాం. ముందస్తు సూచనలు ఇవ్వడం వల్ల రైతులు అప్రమత్తమయ్యే అవకాశం ఉంటుంది.
– శ్రీలక్ష్మి, వాతావరణ శాస్త్రవేత్త, పొలాస
ఆధునాతన టెక్నాలజీతో
పొలాస వ్యవసాయ పరిశోధన స్థానంలోని ఆధునాతన టెక్నాలజీతో ముందస్తు వాతావరణ సమాచారాన్ని రైతులకు అందిస్తున్నాం. కచ్చితమైన డాటాను రికార్డు చేయడంతో వాతావరణానికి సంబంధించి మెరుగైన సమాచారం వస్తుంది. ఎప్పటికప్పుడు రైతులను అప్రమత్తం చేసి, వారికి తగిన సలహాలు ఇస్తున్నాం.
– శ్రీలత, పరిశోధన స్థానం డైరెక్టర్, పొలాస

వాట్సాప్ గ్రూపుల్లో పెట్టాలి

వాట్సాప్ గ్రూపుల్లో పెట్టాలి