
హామీలు నెరవేర్చకుంటే సార్వత్రిక సమ్మె
కోరుట్ల: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్‌వాడీల హామీలు నెరవేర్చకుంటే జూలై 9 నుంచి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు దిగనున్నట్టు ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షురాలు సాయీశ్వరి తెలిపారు. ఈ మేరకు జిల్లా సంక్షేమ అధికారి బోనగిరి నరేశ్‌కు సమ్మె నోటీసు అందించారు. అనంతరం మాట్లాడుతూ కేంద్ర కార్మిక సంఘాల సూచన మేరకు అంగన్‌వాడీ ఉద్యోగులంతా సమ్మెలో పాల్గొంటారని పేర్కొన్నారు. ఐసీడీఎస్ స్థాపించి 50 ఏళ్లు గడుస్తున్నా ఐసీడీఎస్‌ను శాశ్వతసంస్థగా అంగీకరించటం లేదని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివక్ష చూపటం సరికాదన్నారు. అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల సమస్యల పరిష్కారానికి సమ్మెకు దిగుతున్నట్టు పేర్కొన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ.10 లక్షలు, రూ.10 వేల పింఛన్, గ్రాట్యూటీ, పీఎఫ్, ఈఎస్‌ఐ అమలు చేయాలని డిమాండ్ చేశారు. హెల్త్ కార్డులు జారీ చేయాలని డిమాండ్ చేశారు.