
● జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్
రాయికల్: రాయికల్ అభివృద్ధికి కృషి చేస్తున్నామని, ఇందులో భాగంగా రూ.15 కోట్లు మంజూరు చేయి ంచామని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. పట్టణంలోని పలు వార్డుల్లో మంగళవారం పర్యటించారు. సమస్యలను కాలనీవాసులను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాయికల్‌కు రూ.3 కోట్లు మంజూరు చేశామని, వాటితో వార్డుల్లో వసతులు కల్పిస్తామన్నారు. గ్రామానికి రూ.20 లక్షల చొప్పున మంజూరు చేశామని, పల్లె దవాఖానాలు, పాఠశాలల అభివృద్ధి, తాగునీటి సౌకర్యాలకు ప్రాధాన్యత ఇచ్చామని వివరించారు. అనంతరం 67 మంది లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ కింద రూ.19.60 లక్షలు, 71 మందికి కల్యాణలక్ష్మీ కింద రూ.71 లక్షల చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి, తహసీల్దార్ నాగార్జున, ఎంపీడీవో చిరంజీవి, మున్సిపల్ మాజీ చైర్మన్ మోర హన్మండ్లు, నాయకులు గన్నె రాజిరెడ్డి, రవీందర్‌రావు, పడిగెల రవీందర్‌రెడ్డి, కోల శ్రీనివాస్, అనుపురం శ్రీనివాస్, తిరుపతిగౌడ్ పాల్గొన్నారు.