బకాయి భారం.. విద్యార్థులకు శాపం | - | Sakshi
Sakshi News home page

బకాయి భారం.. విద్యార్థులకు శాపం

Jun 25 2025 7:02 AM | Updated on Jun 25 2025 7:18 AM

జగిత్యాలటౌన్‌: జిల్లాలోని బెస్ట్‌ అవైలబుల్‌ స్కూ ళ్లకు విద్యార్థులకు సంబంధించిన ఫీజు బకాయిలను ప్రభుత్వం రెండేళ్లుగా విడుదల చేయకపోవడంతో వారిని ఆయా యాజమాన్యాలు అనుమతి ంచడం లేదు. దీంతో జిల్లాలోని ఐదు పాఠశాలల కు చెందిన 550మంది విద్యార్థులు రోడ్డున పడ్డా రు. బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్‌గా ఎంపికై న ప్రైవేటు పాఠశాలల్లో విద్యాసంవత్సరం ప్రారంభంలోనే విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్స్‌, షూస్‌, టై, బెల్ట్‌, బ్యాడ్జెస్‌ అందించాల్సి ఉంటుంది. హాస్ట ల్‌ విద్యార్థులకు భోజనం, వసతి కల్పిస్తూ మెరుగైన విద్య అందించాల్సి ఉంటుంది. ఇలా జిల్లాలో ఐదు స్కూళ్లు ఎంపికయ్యాయి. ఇందులో సుమారు 550 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరికి సంబంధించి 2023– 24, 2024– 25కుగాను ప్రభుత్వం రూ.2కోట్ల ఫీజు బకాయి పడింది. దీంతో ఆయా పాఠశాలలు విద్యార్థులకు బో ధన చేయలేమంటూ చేతులెత్తేశాయి. ఫీజు బకా యిలు చెల్లించాలంటూ యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులపై ఒత్తిడి చేస్తున్నాయి. దీంతో ఏం చేయాలో పాలుపోని వారు కలెక్టర్‌ను కలిసి గోడు వెల్లబోసుకున్నారు. నిరుపేద కుటుంబాలకు చెందిన తాము పిల్లలకు మెరుగైన విద్య అందుతుందని భావించి ఈ పాఠశాలల్లో చేర్పించామని, ఇప్పుడు తమ పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పిల్లల చదువుకు ఆటంకం కలగకుండా చూడాలని వేడుకున్నారు.

నా కొడుకును చేర్పించా..

మాది మల్యాల మండలం తక్కళ్లపల్లి. మా బాబు సుశాంత్‌ కొడిమ్యాలలోని నాచుపల్లిలోని వాసవి హైస్కూల్‌ (బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్‌)లో చదువుతున్నాడు. ప్రభుత్వం నుంచి ఫీజు రాలేదట. రెండేళ్ల నుంచి బకాయి ఉందని, ఆ మొత్తం మమ్మల్ని చెల్లించాలని అంటున్నారు. మా బాబు చదువుకు అటంకం రాకుండా చూడాలి.

– గడ్డం శ్రీనివాస్‌, పేరెంట్‌, తక్కళ్లపల్లి

కూతురు భవిష్యత్‌ ఆగం చేయొద్దు

మాది బీర్‌పూర్‌ మండలం రంగసాగర్‌. భోజన వసతి, మంచి చదువు చెబుతారని నా కూతురు అనన్యను వాసవి బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్‌లో చేర్పించాను. ఇప్పుడు రెండేళ్ల ఫీజు బకాయి ఉందని చెబుతున్నారు. ఈ ఏడాది స్కూల్‌కు పంపిస్తే రెండేళ్ల ఫీజు చెల్లించాలని అంటున్నారు. పిల్లల భవిష్యత్‌ దృష్ట్యా నిధులు విడుదల చేయించండి.

– నారపాక లత, పేరెంట్‌, రంగసాగర్‌

బెస్ట్‌ అవైలబుల్‌ పాఠశాలలకు నిధుల నిలిపివేత

విద్యార్థులను ఇబ్బంది పెడుతున్న యాజమాన్యాలు

జిల్లాలోని ఐదు స్కూళ్లలో 550 మంది విద్యార్థులు

వీరి పేరిట నిలిచిపోయిన సుమారు రూ.2 కోట్లు

బకాయి భారం.. విద్యార్థులకు శాపం1
1/2

బకాయి భారం.. విద్యార్థులకు శాపం

బకాయి భారం.. విద్యార్థులకు శాపం2
2/2

బకాయి భారం.. విద్యార్థులకు శాపం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement