డ్రగ్స్‌ రహిత సమాజాన్ని నిర్మిద్దాం | - | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌ రహిత సమాజాన్ని నిర్మిద్దాం

Jun 24 2025 3:35 AM | Updated on Jun 24 2025 3:35 AM

డ్రగ్

డ్రగ్స్‌ రహిత సమాజాన్ని నిర్మిద్దాం

● కలెక్టర్‌ సత్యప్రసాద్‌

జగిత్యాలరూరల్‌: డ్రగ్స్‌ రహిత సమాజ నిర్మాణానికి అందరం కృషిచేద్దామని కలెక్టర్‌ సత్యప్రసాద్‌, ఎస్పీ అశోక్‌ కుమార్‌ అన్నారు. మత్తుపదార్థాల వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక వారోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం ఎస్పీ కార్యాలయంలో మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడతూ.. మత్తు పదార్థాల నివారణకు విద్యార్థులు, యువత కలిసికట్టుగా ముందుకు సాగాలన్నారు. మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా అన్ని పోలీస్‌ష్టేషన్ల పరిధిలో అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. యువత, గంజాయి, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలన్నారు. అనంతరం పోస్టర్‌ ఆవిష్కరించారు. ముందుగా ఎస్పీ ఆధ్వర్యంలో అన్ని పాఠశాలలు, కళాశాల విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ భీంరావు, డీఎస్పీ రఘుచందర్‌, సీఐలు కిరణ్‌కుమార్‌, వేణు, సైదులు, శ్రీనివాస్‌, ఆరీఫ్‌ అలీఖాన్‌, కరుణాకర్‌, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

బాధితుల సమస్యలు పరిష్కరిస్తాం

జగిత్యాలక్రైం: బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ అశోక్‌కుమార్‌ అన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 21 మంది నుంచి దరఖాస్తులు స్వీకరించారు. వారితో నేరుగా మాట్లాడిన ఆయన.. సమస్యలను వెంటనే పరిష్కరించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యలను వెంటవెంటనే పరిష్కరించేలా కృషి చేస్తున్నామని వివరించారు.

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ర్యాంక్‌ సాధించాలి

జగిత్యాల: స్వచ్ఛ సర్వేక్షణ్‌లో జిల్లా మెరుగైన ర్యాంక్‌ సాధించాలని అదనపు కలెక్టర్‌ లత అన్నారు. కేంద్ర గ్రామీణ, పారిశుధ్య మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో జిల్లాలవారీగా స్వచ్ఛత స్థాయిని అంచనా వేస్తారని, గణాంకాలు, నాణ్యత ఆధారంగా ర్యాంక్‌లు ఇస్తారని వివరించారు. గ్రామాల్లో శుభ్రత, ఎస్‌బీఎంజీ ద్వారా సాధించిన విజయాలు, సేవస్థాయి పురోగతి, వ్యర్థ నిర్వహణ కేంద్రాలు, ఓడీఎఫ్‌ మారుతుంటాయని పేర్కొన్నారు. అధికారులంతా కలిసికట్టుగా మార్కులు సాధించి జిల్లాను మొదటిస్థానంలో నిలపాలని కోరారు. డీఆర్డీఏ పీడీ రఘువరణ్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

నేడు డయల్‌ యుర్‌ డీఎం

జగిత్యాలటౌన్‌: మంగళవారం ఉదయం 11 గంటల నుంచి 12గంటల వరకు డయర్‌ యువర్‌ డీఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జగిత్యాల డిపో మేనేజర్‌ కల్పన సోమవారం తెలిపారు. ప్రయాణికులు తమ సందేహాలు, సలహాలు, సూచనలను 99592 25925 నంబర్‌కు ఫోన్‌ చేసి చెప్పాలని సూచించారు.

పోలీసులపై మాజీమంత్రి వ్యాఖ్యలు సరికాదు

జగిత్యాలక్రైం: మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్‌ పోలీసులపై చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై.గోపిరెడ్డి అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. శ్రీలంచం తీసుకోకుంటే పోలీసులకు నడవదా..? పోలీసులేమీ సుద్దపూసలు కాదు. బల్లకింద చేయి పెట్టకుంటే వారికి నడవదు..శ్రీ అని వ్యాఖ్యానించడం సరికాదని పేర్కొన్నారు. తమ పార్టీ నాయకులపై దృష్టి పెడితే ఒక్క పోలీసు విధుల్లో ఉండడనే బెదిరింపు ధోరణిలో మాట్లాడటాన్ని ఖండించారు. అక్రమ దందాలు, అవినీతిని అరికట్టడంలో.. శాంతిభద్రతల విషయంలో అంకితభావంతో పనిచేస్తున్నామని, ప్రజలకు అండగా నిలవడంలో ఎప్పుడూ వెనుకడుగు వేయబోరని, అలాంటి పోలీస్‌లపై ఇలాంటి వ్యాఖ్యలు సరికాదని పేర్కొన్నారు.

డ్రగ్స్‌ రహిత సమాజాన్ని నిర్మిద్దాం1
1/2

డ్రగ్స్‌ రహిత సమాజాన్ని నిర్మిద్దాం

డ్రగ్స్‌ రహిత సమాజాన్ని నిర్మిద్దాం2
2/2

డ్రగ్స్‌ రహిత సమాజాన్ని నిర్మిద్దాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement