
ప్రజావాణికి వినతుల వెల్లువ
జగిత్యాలటౌన్: కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో బాధితుల నుంచి కలెక్టర్ సత్యప్రసాద్ అర్జీలు స్వీకరించారు. 61 మంది వివిధ సమస్యలతో కలెక్టరేట్‌కు వచ్చారు. వాటిని పరిశీలించిన కలెక్టర్ పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అదనపు కలెక్టర్ బీఎస్ లత, జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి ఆర్డీవోలు మధుసూదన్‌గౌడ్, జివాకర్ రెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు.
డబ్బులు ఇప్పించండి
మాది బుగ్గారం మండలం వెల్గొండ. నాకు ఉన్న ఆటోను గతంలో రంగపేటలో ఏఈవో పనిచేసిన ముత్యాల మల్లేశం అద్దెకు తీసుకున్నాడు. దాని అద్దె రూ.32వేలు ఇవ్వలేదు. అడిగితే బెదిరిస్తున్నాడు. నా డబ్బులు నాకు ఇప్పించి ఆదుకోండి.
(23జేజిఎల్157)
డబుల్ ఇళ్లు ఇప్పించండి
మాది కోరుట్లలోని అల్లమయ్యగుట్ట ప్రాంతం. మాకు గత ప్రభుత్వం నివేశన స్థలాలు ఇచ్చి పట్టాలు పంపిణీ చేసింది. స్థలం కేటారులుంచిన ప్రభుత్వం ఇప్పటివరకు నిర్మాణం ప్రారంభించలేదు. ప్రభుత్వం చొరవ తీసుకుని మాకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు నిర్మించి ఇవ్వండి.

ప్రజావాణికి వినతుల వెల్లువ

ప్రజావాణికి వినతుల వెల్లువ