
రాజవిష్ణు (ఫైల్)
మల్లాపూర్(కోరుట్ల): జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం గొర్రెపల్లి గ్రామానికి చెందిన క్రీడాకారుడు కొంపల్లి రాజవిష్ణు(34) క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందాడు. ఈసంఘటన మల్లాపూర్‌లో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. గొర్రెపల్లికి చెందిన సరోజన – రాజం దంపతులకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరికి వివాహాలయ్యాయి. రాజం 15ఏళ్ల క్రితమే అనారోగ్యంతో మృతి చెందాడు. 2019 ఎన్నికల్లో కొంపల్లి సరోజన సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. చిన్నకుమారుడైన రాజవిష్ణు ఆమెకు చేదోడువాదోడుగా ఉంటున్నాడు. రాజవిష్ణుకి భార్య వాణి, కుమార్తెలు విశ్వాణి(10), వైష్ణవి(8), కుమారుడు శ్రీయాన్(4) ఉన్నారు. మల్లాపూర్‌లో చేపట్టిన ఎంపీఎల్ క్రికెట్ లీగ్‌లో క్రికెట్ ఆడుతుండగానే గుండెపోటుకు గురై కుప్పకూలాడు. సహచర ఆటగాళ్లు సీపీఆర్ చేసి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు తదితరులు సంతాపం ప్రకటించారు.
భవన నిర్మాణాల ప్రకారంపన్ను విధింపు
ధర్మపురి: పురాతన ఇళ్ల స్థానంలో కొత్తగా నిర్మించుకున్న భవన నిర్మాణాల ప్రకారం పన్ను విధింపు ఉంటుందని ధర్మపురి మున్సి పల్ కమిషనర్ రమేశ్ ఒక ప్రకటనలో తెలి పారు. మేజర్ పంచాయతీగా ఉన్న సమయంలో ఇంటి పన్నులకు మున్సిపాలిటీగా మారిన త ర్వాత పన్నులకు తేడా ఉంటుందన్నారు. సందేహాలుంటే నేరుగా మున్సిపల్ కార్యాలయానికి వచ్చి, తెలుసుకోవచ్చని పేర్కొన్నా రు. కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ హైదరాబాద్ వారి ఆదేశాల మేరకు లేఖ నంబర్ 414849/2022–యంఐ తేదీ 20–05–2022 నుంచి ట్యాక్స్ రేట్ నివాస భవనాలకు 1–00 నుంచి 0.25కు, నివాసేతర భవనాలకు 0.40కు తగ్గించినట్లు తెలిపారు. వీటిని అనుసరించి పట్టణంలోని భవనాలకు ఇంటి పన్ను విధిస్తున్నట్లు పేర్కొన్నారు.