రష్యా-ఉక్రెయిన్‌ వార్‌ చరిత్రలోనే.. అతి పెద్ద దాడి ఇదే | Russia Hits Ukraine With Biggest Attack Of The War | Sakshi
Sakshi News home page

రష్యా-ఉక్రెయిన్‌ వార్‌ చరిత్రలోనే.. అతి పెద్ద దాడి ఇదే

Jun 29 2025 4:37 PM | Updated on Jun 29 2025 5:53 PM

Russia Hits Ukraine With Biggest Attack Of The War

శనివారం రాత్రి రష్యా 477 డ్రోన్లు, 60 క్షిపణులతో ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసింది. యుద్ధం మొదలైన నాటి నుంచి జరిగిన అతిపెద్ద దాడి ఇదేనంటూ ఉక్రెయిన్ వైమానిక దళం తెలిపింది. వీటిల్లో 249ని కూల్చేశామని.. మరో 226 ఎలక్ట్రానిక్‌ జామింగ్‌ వ్యవస్థల ప్రభావంతో కూలిపోయాయని.. గత రాత్రి అతిపెద్ద దాడే జరిగిందంటూ ఉక్రెయిన్‌ అధికారులు వెల్లడించారు. 

ఉక్రెయిన్‌లోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని రష్యా దాడి చేసినట్లు అధికారులు వివరించారు. ఈ దాడిలో ఉక్రెయిన్‌కు చెందిన ఎఫ్‌-16 యుద్ధ విమానం కూలిపోయిందని.. ఒక పైలట్‌ మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. శనివారం సాయంత్రం రష్యా ఆరు గంటలకు పైగా దాడులు చేసింది. దేశ వ్యాప్తంగా కీలకమైన మౌలిక సదుపాయాలు దెబ్బతీన్నాయని అధికారులు పేర్కొన్నారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య 2022 దాడులు కొనసాగుతున్నాయి.  36 నెలలు గడిచినా ఆగని రష్యా, ఉక్రెయిన్‌ పోరు ఆగడం లేదు.

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్‌లో వెలుగుచూసిన అతిపెద్ద వైరం ఇదే. వాస్తవానికి తాజా యుద్ధానికి పునాదులు పదేళ్ల క్రితమే పడ్డాయి. 2014లో ఉక్రెయిన్‌లోని క్రిమియా ద్వీపకల్పాన్ని రష్యా ఉన్నపళంగా ఆక్రమించుకుంది. ఆనాటి నుంచి ఇరుదేశాల మధ్య సంబంధాలు పూర్తిగా చెడిపోయాయి. ఆ తర్వాత 2022 ఫిబ్రవరి 24వ తేదీన ఉక్రెయిన్‌ పైకి రష్యా దండయాత్ర మొదలెట్టింది. వందల కొద్దీ చిన్నపాటి క్షిపణులు ప్రయోగిస్తూ వేలాది సైనికులను కదనరంగంలోకి దింపింది.

తొలి రోజుల్లో రాజధాని కీవ్‌దాకా దూసుకొచ్చి భీకర దాడులు చేసిన రష్యా ఆ తర్వాత ఆక్రమణ వేగాన్ని అనూహ్యంగా తగ్గించింది. ఉక్రెయిన్‌ వైపు నుంచి ప్రతిఘటన కూడా దీనికి ఒక కారణం. ఉక్రెయిన్‌ తొలినాళ్లలో యుద్ధంలో తడబడినా ఆ తర్వాత అగ్రరాజ్యం, యూరప్‌ దేశాల ఆర్థిక, ఆయుధ, నిఘా బలంతో చెలరేగిపోయింది. ధాటిగా దాడులు చేస్తూ పుతిన్‌ పటాలానికి ముచ్చెమటలు పట్టించింది. దీంతో మరింత శక్తివంతమైన ఆయుధాలను రష్యా బయటకుతీయక తప్పలేదు.

ఇదీ చదవండి: Russia-Ukraine war: యుద్ధం @ మూడేళ్లు

 

 

Advertisement
 
Advertisement
Advertisement