ఇంటర్వ్యూ కోసం వెళ్తే.. కిడ్నాప్‌ చేశారు | American Youtuber Kidnapped By Haiti Notorious Gang While Trying To Interview Gang Leader - Sakshi
Sakshi News home page

సరదా సరదాకి ఇంటర్వ్యూ కోసం వెళ్తే.. కిడ్నాప్‌ చేసేశారు

Published Sat, Mar 30 2024 9:17 AM

American Youtuber Kidnapped By Haiti Notorious Gang - Sakshi

ఈరోజుల్లో యూట్యూబర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు. కొందరు జెన్యూన్‌గా సబ్‌ స్క్రైబర్లను పెంచుకునేందుకు ప్రయత్నిస్తుంటే.. మరికొందరు మాత్రం రకరకాల ఫీట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో.. కాస్త ఫేమ్‌ సంపాదించుకున్న ఓ యూట్యూబర్‌ సాహసం ప్రదర్శించబోయి చిక్కుల్లో పడ్డాడు. 

జార్జియాకు చెందిన యూట్యూబర్‌ అడిసన్‌ పీయెర్రె మాలౌఫ్‌(యూట్యూబ్‌లో YourFellowArab/Arab). ప్రపంచంలో ప్రమాదకరమైన ప్రాంతాలుగా పేరున్న చోట్లకు వెళ్తూ.. అత్యంత ప్రమాదకరమైన వ్యక్తుల్ని ఇంటర్వ్యూలు చేస్తూ ఆ వీడియోలతో 1.4 మిలియన్‌ సబ్‌స్కయిబర్లను సంపాదించుకున్నాడు. ఈ క్రమంలో.. కరేబియన్‌ దేశం హైతీలో ఓ ముఠా నాయకుడ్ని ఇంటర్వ్యూ చేయాలని డిసైడ్‌ అయ్యాడు. 

మావోజో అనే ముఠా నాయకుడు జిమ్మీ ‘బార్బీక్యూ’ చెరిజైర్‌కు హైతీలోనే కరడుగట్టిన గ్యాంగ్‌ లీడర్‌గా పేరుంది. అలాంటి వ్యక్తిని ఇంటర్వ్యూ చేయడానికి అడిసన్‌ వెళ్లాడు. ఇందుకోసం హైతీలో ఓ స్థానిక టూరిస్ట్‌ సాయం తీసుకున్నాడు. అయితే.. ఆ గ్యాంగ్‌ ఉండే ప్రాంతానికి వెళ్లగానే వాళ్లిద్దరినీ తుపాకులతో 400 మంది చుట్టుముట్టారు. వదిలిపెట్టాలంటే 6 లక్షల డాలర్లు ఇవ్వాలంటూ డిమాండ్‌ చేశారు.

తన దగ్గరున్న 40 వేల డాలర్లను వాళ్లకు ఇచ్చేసి విడిచిపెట్టమని అడిసన్‌ బతిమాలాడట. అయితే ఆ ముఠా అవి లాగసుకుని.. మిగతాది ఇస్తేనే రిలీజ్‌ చేస్తామని షాకిచ్చింది ఆ గ్యాంగ్‌. దీంతో తన స్నేహితుల కాంటాక్ట్‌ కోసం అడిసన్‌ ప్రయత్నిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో..  మార్చి 14వ తేదీన అడిసన్‌ను మావోజో ముఠా కిడ్నాప్‌ చేయగా, రెండు వారాలు ఆలస్యంగా ఆ విషయం బయటి ప్రపంచానికి తెలిసిందే. తోటి యూట్యూబర్‌ ఒకరు ఈ సమాచారాన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం అతన్ని విడిపించేందుకు అవసరమైన డబ్బును సమీకరించేందుకు కొందరు యూట్యూబర్లు ముందుకు వచ్చారు.

Advertisement
 
Advertisement
 
Advertisement