
బల్దియాలో పరికరాల చోరీ
వరంగల్ అర్బన్ : వరంగల్ బల్దియా ప్రధాన కార్యాలయం ఆవరణలో చోరీలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. కమాండ్ కంట్రోల్ సిస్టమ్ పనిచేస్తున్నా.. దొంగతనాలకు అడ్డుకట్టపడే పరిస్థితి కనిపించడం లేదు. తాజాగా బల్దియా ప్రధాన కార్యాలయంలో స్టోర్ తాళాలు పగులకొట్టి న్యూస్ పేపర్స్ బండిల్స్, ఇనుము, ఇతర పరికరాలు అపహరించారు. క్షేత్రస్థాయి సిబ్బంది పనినా.. లేక ఇతరుల ప్రమేయం ఉందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బల్దియా ప్రధాన కార్యాలయానికి నిఘా నేత్రాలున్నా పనికిరావడం లేదనే ఆ రోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై పరిపాలన విభాగం అధికారులను వివరణ కోరితే పరిశీలిస్తామని దాటవేయడం గమనార్హం.