
న్యూస్‌రీల్
స్టాక్ ట్రేడింగ్ పేరుతో రూ.12 లక్షలు స్వాహా
భూపాలపల్లి అర్బన్: స్టాక్ ట్రేడింగ్ పేరిట రూ.12లక్షలు సైబర్ నేరగాళ్లు స్వాహా చేశారు. ఈ ఘటన భూపాలపల్లి పట్టణంలో గురువారం చోటు చేసుకుంది. స్థానిక సీఐ నరేష్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కృష్ణాకాలనీకి చెందిన ఓ ఉద్యోగిని నాలుగు రోజుల క్రితం వాట్సాప్ ద్వారా స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ అడ్వయిజర్లమని కావ్య, సంధ్య అనే మహిళలు సంప్రదించారు. పెట్టుబడి ప్రణాళికలను వివరిస్తూ మీరు కేవలం 15 రోజుల్లో 50శాతం లాభాలు పొందవచ్చని నమ్మించారు. దీంతో ఆశపడిన సదరు ఉద్యోగి మొదట రూ.లక్ష పెట్టుబడి పెట్టగా, దానికి లాభాలు వచ్చాయని సైబర్ నేరగాళ్లు పంపించారు. ఆ తరువాత బాధితుడు దశల వారీగా రూ.12లక్షల వరకు పెట్టుబడి పెట్టాడు. రెండు రోజుల తరువాత సైబర్ నేరగాళ్లు వాట్సాప్ నంబర్లు మార్చేశారు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు భూపాలపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఉగ్రప్రభ,
త్వరితాక్రమాల్లో భద్రకాళి
హన్మకొండ కల్చరల్ : వరంగల్ నగరంలోని శ్రీభద్రకాళి దేవాలయంలో నిర్వహిస్తున్న శాకంబరీ నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా గురువారం ఎనిమిదవ రోజు అమ్మవారిని ఉగ్రప్రభ, త్వరితాక్రమాల్లో పూజలు నిర్వహించారు. అర్చకులు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు ఉదయం అమ్మవారికి సుప్రభాతసేవ, నిత్యాహ్నికం నిర్వహించి పూలమాలలతో అలంకరించారు. అనంతరం కాళీక్రమాన్ని అనుసరించి స్నపనభేరాన్ని ఉగ్రప్రభమాతగా, షోడశీక్రమాన్ని అనుసరించి భోగభేరాన్ని త్వరితామాతగా అలంకరించి పూజలు జరిపారు. ఈఓ శేషుభారతి, సిబ్బంది, ధర్మకర్తలు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
జాతీయ సదస్సు
బ్రోచర్ ఆవిష్కరణ
కేయూ క్యాంపస్ : హనుమకొండలోని ప్రభుత్వ పింగిళి మహిళా డిగ్రీ, పీజీ కళాశాలలో వాణిజ్య శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో రెండ్రోజుల పాటు జరిగే జాతీయ సదస్సు బ్రోచర్‌ను గురువారం కేయూ వీసీ ప్రొఫెసర్ కె.ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి.రామచం ద్రం, ఆ కళాశాల ప్రిన్సిపాల్ బి.చంద్రమౌళితో కలిసి ఆవిష్కరించారు. సెప్టెంబర్ 17, 18 తేదీల్లో ఈ సదస్సు నిర్వహించనున్నట్లు చంద్రమౌళి తెలిపారు. ఆర్థిక రంగంలో మానవ వనరుల నిర్వహణ, నివేదికల విశ్లేషణకు ఈ సదస్సు దోహదం చేస్తుందని సదస్సు కన్వీనర్ డాక్టర్ పెండ్యాల రాజిరెడ్డి తెలిపారు. కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కె.రాజేందర్, వైస్ ప్రిన్సిపాల్ జి.సుహాసిని, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ సురేష్‌బాబు, వాణిజ్యశాస్త్ర విభాగం అధిపతి సారంగపాణి, అధ్యాపకులు రాజు, సుమలత, సమత, సురేష్, హేమలత తదితరులు పాల్గొన్నారు.
తీర్థయాత్రలకు ప్రత్యేక రైలు
జనగామ: దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించేందుకు రైల్వే శాఖ భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రెయిన్ ద్వారా సేవలను అందుబాటులోకి తీసుకొ చ్చిందని టూరిజం అసిస్టెంట్ మేనేజర్(ఐఆర్‌సీటీసీ) పీవీ వెంకటేష్ తెలిపారు. జనగామ రైల్వేస్టేషన్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 19వ తేదీ నుంచి 26 వరకు తీర్థయాత్రల కోసం ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు స్పష్టం చేశారు. దివ్యదక్షిణ జ్యోతిర్లింగ యాత్రలో భాగంగా తిరువణ్ణామలై(అరుణాచలం), రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, త్రివేండ్రం, తిరుచ్చి, తంజావూరు క్షేత్రాలను సందర్శించవచ్చన్నారు. ఒక్కొక్కరికీ సాధారణ టికె ట్ రూ.14,100, థర్డ్ ఏసీ రూ.22,300, సెకండ్ ఏసీ రూ.29,200 టికెట్ ధర నిర్ణయించినట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న వారు టికెట్ బుకింగ్‌కోసం 97013 60701, 92810 30711, 9281030 712, 92814 95843, 92810 30750 నంబర్లలో సంప్రదించాలని కోరారు.

న్యూస్‌రీల్

న్యూస్‌రీల్