
కాలనీల్లో నీరు నిల్వకుండా చర్యలు
మేయర్ గుండు సుధారాణి
న్యూశాయంపేట: వరంగల్ 3వ డివిజన్ పైడిపల్లిలోని కాలనీల్లో వర్షపు నీరు నిల్వకుండా చర్యలు తీసుకోవాలని నగర మేయర్ గుండు సుధారాణి, వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజులు అఽధికారులను ఆదేశించారు. పైడిపల్లి కొత్తగూడెంలోని ఎస్సీ, బీసీ కాలనీల్లో వర్షపు నీరు తమ ఇళ్లలోకి చేరుతుందని, విషపురుగులు వస్తున్నాయని స్థానికుల ఫిర్యాదు మేరకు బుధవారం మేయర్, ఎమ్మెల్యే కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు. స్థానికులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. వెంటనే పరిష్కరించాలని అక్కడే ఉన్న అధికారులకు సూచించారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ జన్ను షీభారాణి అనిల్‌కుమార్, సీఎంహెచ్‌ఓ డా.రాజారెడ్డి, ఎంహెచ్‌ఓ డా.రాజేష్, ఈఈ సంతోష్‌బాబు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.