
సురేఖ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలి
● ఎన్నికల సంఘానికి మాజీ ఎమ్మెల్యే నరేందర్ ఫిర్యాదు
వరంగల్ చౌరస్తా: గత శాసన సభ ఎన్నికల్లో వరంగల్ తూర్పు ఎమ్మెల్యేగా పోటీ చేసిన కొండా సురేఖ రూ.70 కోట్లు ఖర్చు చేసినట్లు స్వయంగా తన భర్త, మాజీ ఎమ్మెల్సీ మురళీధర్ రావు బహిరంగంగా ప్రకటించడంపై చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్‌లో ఉప ప్రధాన ఎన్నికల అధికారి బి.హరిసింగ్‌ను కలిసి వినతిపత్రం అందించారు. ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న ఆస్తులను పరిశీలించాలని కోరారు. తాజాగా వరంగల్ తూర్పు నియోజక వర్గంలో జరిగిన కార్యక్రమంలో కొండా మురళీధర్ రావు వ్యాఖ్యల వీడియోలు ఉన్నాయని, వాటిని పరిశీలించి సురేఖ శాసన సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరారు.
డీఎంహెచ్‌ఓ, ప్రోగ్రాం అధికారులకు సన్మానం
గీసుకొండ: జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని వరంగల్ నగరంలోని వరంగల్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో సిబ్బంది, అధికారులు మంగళవారం డీఎంహెచ్‌ఓ సాంబశివరావు, ప్రోగ్రాం అధికారులను సన్మానించారు. అనంతరం డీఎంహెచ్‌ఓ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వైద్యులు, సిబ్బంది సమయ పాలన పాటించాలని, వర్షాకాలంలో సంక్రమించే వ్యాధుల నివారణపై దృష్టి సారించాలన్నారు. డిప్యూటీ డీఎంహెచ్‌ఎఓలు ప్రకాశ్, కొమురయ్య, ప్రోగ్రాం అధికారులు ఆచార్య, అర్చన, విజయ్‌కుమార్, డిప్యూటీ డెమో అనిల్‌కుమార్, ఎస్‌ఓ విజయలక్ష్మి, డీపీఓ అర్చన ,సిబ్బంది పాల్గొన్నారు.

సురేఖ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలి