
టీజీఎప్‌సెట్ సర్టిఫికెట్ల పరిశీలన షురూ..
కేయూ క్యాంపస్: తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం టీజీఎప్‌సెట్ –2025 ఎంపీసీ స్ట్రీమ్‌లో ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకుగాను కాకతీయ యూనివర్సిటీ, హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్‌అండ్ సైన్స్ కాలేజీ, కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాలల్లోని హెల్ప్‌లైన్ సెంటర్లలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ మంగళవారం ప్రారంభమైంది. ప్రథమ దశలో ఇప్పటికే స్లాట్‌బుకింగ్ చేసుకున్న విద్యార్థులు ఆయా హెల్ప్‌లైన్ సెంటర్లలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరయ్యారు. స్లాట్ బుకింగ్ ప్రక్రియ జూన్ 28 నుంచి జూలై 7వ తేదీ వరకు ఉంది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జూలై 8వ తేదీ వరకు కొనసాగనుంది. క్యాంపస్‌లోని అడ్మిషన్ల డైరెక్టరేట్‌లో హెల్ప్‌లైన్ సెంటర్లో సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేసుకున్న విద్యార్థులకు డైరెక్టర్ ప్రొఫెసర్ సీజే శ్రీలత, సహాయ కోఆర్డినేటర్ సురేశ్‌బాబు ధ్రువపత్రాలు అందజేశారు. తొలిరోజు 300 మంది విద్యార్థులకు వెరిఫికేషన్ చేశారు. ఆర్ట్స్ అండ్ స్సైన్స్ కాలేజీ హెల్ప్‌లైన్‌సెంటర్‌లో ప్రిన్సిపాల్ ఎస్.జ్యోతి విద్యార్థులకు ధ్రువపత్రాలు అందజేశారు.అలాగే, కేడీసీలోనూ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగింది. వరంగల్‌లోని ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాలలో ఆ కళాశాల ప్రిన్సిపాల్ బైరి ప్రభాకర్ సర్టిఫికెట్ల వెఫికేషన్ చేసుకున్న విద్యార్థులకు ధ్రువపత్రాలు అందజేశారు. తొలిరోజు 400 మంది విద్యార్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరయ్యారని ప్రభాకర్ తెలిపారు.
నాలుగు హెల్ప్‌లైన్ సెంటర్లలో వెరిఫికేషన్ ప్రక్రియ