ప్లేస్‌మెంట్స్‌లో సత్తా చాటిన కేఎల్‌ విద్యార్థులు | - | Sakshi
Sakshi News home page

ప్లేస్‌మెంట్స్‌లో సత్తా చాటిన కేఎల్‌ విద్యార్థులు

Jun 7 2025 1:47 AM | Updated on Jun 7 2025 1:47 AM

ప్లేస్‌మెంట్స్‌లో సత్తా చాటిన కేఎల్‌ విద్యార్థులు

ప్లేస్‌మెంట్స్‌లో సత్తా చాటిన కేఎల్‌ విద్యార్థులు

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌లో తమ కళాశాల విద్యార్థులు సత్తా చాటారని యూనివర్సిటీ ప్లేస్‌మెంట్స్‌ విభాగం డైరెక్టర్‌ డాక్టర్‌ శరవణబాబు తెలిపారు. విజయవాడలోని యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్‌ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే ఇంజినీరింగ్‌ విభాగంలో 100 శాతం ప్లేస్‌మెంట్స్‌ రికార్డు సాధించామని చెప్పారు.

డిగ్రీ, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ కోర్సుల విద్యార్థులు సైతం 155 కు పైగా కంపెనీల్లో ప్లేస్‌మెంట్స్‌ సాధించారని పేర్కొన్నారు. 450 కి పైగా జాతీయ కంపెనీలు, 50 కి పైగా అంతర్జాతీయ కంపెనీలు క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ కోసం యూనివర్సిటీకి వచ్చాయని వెల్లడించారు. నైపుణ్యాల అభివృద్ధిలో విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామన్నారు. యూనివర్సిటీ అడ్మిషన్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ జె. శ్రీనివాసరావు, ఎంహెచ్‌ ఎస్‌ విభాగం డీన్‌ డాక్టర్‌ కిషోర్‌ బాబు మాట్లాడుతూ కేఎల్‌ యూనివర్సిటీలో ఏ కోర్సు చదివినా మంచి ప్యాకేజీతో ప్లేస్‌మెంట్‌ వచ్చేలా స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నామని తెలిపారు. సమావేశంలో యూనివర్సిటీ ప్లేస్‌మెంట్స్‌ విభాగం అసోసియేట్‌ డీన్‌ డాక్టర్‌ చలపతి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement