మిడిల్‌ క్లాస్‌ డ్రీమ్‌ వెహికల్‌: ఐకానిక్‌ లూనా సరికొత్తగా! రిపబ్లిక్‌ డే ఆఫర్‌ | Sakshi
Sakshi News home page

మిడిల్‌ క్లాస్‌ డ్రీమ్‌ వెహికల్‌: ఐకానిక్‌ లూనా సరికొత్తగా! రిపబ్లిక్‌ డే ఆఫర్‌

Published Thu, Jan 25 2024 12:49 PM

Kinetic E Luna coming soon and bookings open on Republic Day - Sakshi

దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్‌ బాగా  పుంజుకుంటోంది. ఈ  ట్రెండ్‌కు అనుగుణంగా  దేశంలోని ప్రముఖ ద్విచక్ర వాహన కంపెనీలన్నీ  తమ మోడళ్లలో ఈవీ వెర్షన్స్‌ లాంచ్‌ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఒకప్పటి మధ్యతరగతి కలల టూవీలర్‌ లూనా సరికొత్త అవతారంలో ఈవీగా భారతీయ  వినియోగదారులను  ఆకట్టుకొనేందుకు భారత్‌లో  లాంచ్‌ కానుంది.

ఈవీలకు పెరిగిన డిమాండ్ నేపథ్యంలో  కెనటిక్ కంపెనీకి చెందిన పాపులర్‌ లూనా స్కూటర్‌ను తాజాగా  ఈవీ వెర్షన్‌‌లో రిలీజ్ చేస్తోంది. అంతేకాదు రిపబ్లిక్‌ డే సందర్భంగా ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. మోస్ట్‌ ఎవైటెడ్‌ మల్టీ యుటిలిటీ e2W, కైనెటిక్ గ్రీన్ E-Lunaను వచ్చే నెల (ఫిబ్రవరి 2024) ఆరంభంలో రిలీజ్‌ చేయనుంది. బుకింగ్‌లు జనవరి 26న షురూ అవుతాయని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. Kinetic Green వెబ్‌సైట్‌లో కేవలం రూ. 500తో ప్రీ-బుక్ చేసుకోవచ్చు.

కైనెటిక్ ఇ-లూనా పూర్తిగా మేడ్-ఇన్-ఇండియాగా వస్తోంది.  మెట్రో ,టైర్ 1, టైర్-2, టైర్-3 నగరాలు , అలాగే గ్రామీణ  యూజర్లును కూడా దృష్టిపెట్టుకుని  అత్యాధునిక ఫీచర్లతో లూనా ఈవీ నితయారు చేసినట్టు  కైనెటిక్ గ్రీన్  ఫౌండర్‌, సీఈవో సులజ్జ ఫిరోడియా మోత్వాని  తెలిపారు. అంతేకాదు  'చల్ మేరీ లూనా' అంటూ యాడ్‌ ప్రపంచంలో సంచలనం రేపిన పియూష్ పాండే తిరిగి  ఈ  బ్రాండ్‌  కోసం పని చేయనున్నారట. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత మళ్లీ  లూనాకోసం సంతోషంగా ఉందని ప్రకటించారు పియూష్‌. నేటి యువతరాన్ని దృష్టిలో  పెట్టుకుని మయూర్ అండ్‌ టీం దీనికోసం పనిచేస్తోందన్నారు.పీయూష్ పాండే ప్రస్తుతం ఒగిల్వీ ఇండియా గ్లోబల్ క్రియేటివ్ ఛైర్మన్, ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఉన్నారు కాగా కైనెటిక్ 2000 ప్రారంభంలో దాని ఉత్పత్తిని నిలిపివేసింది

కైనటిక్ లూనాఫీచర్లు, అంచనాలు
కైనెటిక్ ఇ లూనాకు  సంబంధించిన ఫీచర్లను కంపెనీ అధికారికంగా ప్రకటించనప్పటికీ, అంచనాలు ఈ విధంగా ఉన్నాయి.  16-అంగుళాల వైర్ స్పోక్ వీల్స్, మోపెడ్ ఆపడానికి రెండు చివర్లలో డ్రమ్ బ్రేక్‌లు ఉంటాయి. ఈ లూనా టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, వెనుక వైపున ట్విన్ షాక్ అబ్జార్బర్‌లతో వస్తుంది. ఈ లూనా ఒక ‘హై-స్పీడ్’ ఎలక్ట్రిక్ స్కూటర్‌గా కూడా ఉంటుందని అంచనా.  బ్యాటరీ 5 గంటల్లో పూర్తిగా చార్జ్‌ అవుతుంది. గంటకు గరిష్టంగా 60 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. పవర్‌ట్రెయిన్ డిజైన్ ఛార్జ్ టర్న్‌అరౌండ్ టైమ్‌లను తగ్గించడానికి మార్చుకునే లేదా  రిమూవముల్‌ బ్యాటరీ ప్యా క్‌తో  డిజైన్‌ చేసింది.  

Advertisement
 

తప్పక చదవండి

Advertisement