
కూటమి మోసాలను నిలదీద్దాం
కామవరపుకోట: సూపర్ సిక్స్ పథకాలతో రాష్ట్ర ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వ మోసాన్ని నిలదీద్దామని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. శనివారం ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో చింతలపూడి వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నియోజకవర్గ కన్వీనర్ కంభం విజయరాజు అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో ‘బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ’ అని నాయకులు కూటమి ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈ సందర్భంగా డీఎన్నార్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులనే టార్గెట్‌గా చేసుకుని అక్రమ కేసులు పెడుతూ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ రాష్ట్రంలో అలజడలు సృష్టిస్తున్నారని వీరి మోసాలను గడపగడపకు వెళ్లి ప్రజలకు వివరించాలన్నారు. ఏలూరు పార్లమెంట్ కో–ఆర్డినేటర్ కారుమూరి సునీల్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు సంపద సృష్టిస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్‌కు, పవన్ కల్యాన్‌కు సంపద సృష్టించి పెడుతున్నారన్నారు. అన్నదాత సుఖీభవ పేరుతో రైతులను దగా చేశారన్నారు. కంభం విజయరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో రాష్ట్ర ప్రజలు విసుగు చెంది తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారన్నారు. వారి మోసపూరిత హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ఇంటింటికీ వెళ్లి చంద్రబాబు మోసాలను వివరించాలన్నారు. జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు సరిత భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాలతో మహిళలను మోసం చేసి ఓట్లు వేయించుకున్నారన్నారు. వీరి మోసాలను ప్రతి మహిళ గమనించాలన్నారు. ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ జయప్రకాష్, మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, మచిలీపట్నం పార్లమెంట్ పరిశీలకుడు జెట్టి గురునాథరావు, పార్టీ జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు జగ్గవరపు జానకి రెడ్డి, గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు డాక్టర్ రామకృష్ణ, జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్‌పర్సన్ బత్తిన లక్ష్మి, అంగన్‌వాడీ విభాగం జిల్లా అధ్యక్షురాలు సాయిలు స్వాతి, లింగపాలెం, చింతలపూడి, కామవరపుకోట,జంగారెడ్డిగూడెం మండల అధ్యక్షులు అన్నపనేని శాంతారావు, కొప్పుల నాగేశ్వరరావు, రాయంకుల సత్యనారాయణ, ఓరుగంటి నాగేంద్ర, జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షుడు కర్పూరం గురవయ్య తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు