జగత్‌ కిలాడీలకు ఝలక్‌

Cyberabad Police Arrest International Criminals For Three Years - Sakshi

సాక్షి హైదరాబాద్‌: దేశ, విదేశీ పోలీసులకు ముప్పు తిప్పలు పెడుతూ.. మూడేళ్లుగా ఇంటర్నేషనల్‌ క్రెడిట్‌ కార్డుదారులను మోసం చేస్తున్న అంతర్జాతీయ నేరస్తులను సైబరాబా ద్‌ పోలీసులు అరెస్టు చేశారు. సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్స్‌ ఏసీపీ శ్రీధర్‌తో కలిసి సీపీ స్టీఫెన్‌ రవీంద్ర వివరాలు వెల్లడించారు.  

మూడు కాల్‌ సెంటర్ల ఏర్పాటు 

  • ఐటీలో విశేష అనుభవం ఉన్న న్యూఢిల్లీకి చెందిన నవీన్‌ భూటానీ 2017లో ఆర్‌ఎన్‌టెక్‌ సర్వీసెస్‌ కంపెనీని ఏర్పాటు చేసి.. విదేశీ కస్టమర్లకు సాంకేతిక సేవల ను అందిస్తున్నాడు. ఈ క్రమంలో ఢిల్లీకి చెందిన మోహిత్‌ కుమార్, మోను సింగ్‌లతో పరిచయం ఏర్పడింది. టెక్నాలజీ సేవల పేరుతో విదేశీ కస్టమర్లను మోసం చేయాలని నిర్ణయించుకొని ఢిల్లీలోని జనక్‌పురి, ఘజియాబాద్‌లోని కోశాంబి, పంజాబ్‌లోని మొహాలీలో మూడు కాల్‌ సెంటర్లను ఏర్పాటు చేశారు. 80 మంది టెలీకాలర్లను నియమించుకున్నారు. 
  • అమెజాన్, పేపాల్‌ వంటి ఈ– కామర్స్‌ సైట్లలో నమోదయిన ఇంటర్నేషనల్‌ క్రెడిట్‌ కార్డ్‌ వినియోగదారుల వివరాలను సేకరించారు. ‘మీరు ఫలానా రోజున ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేశారు. మీ ఖాతా నుంచి సొమ్ము కట్‌ అయింది. మీరు సంబంధిత లావాదేవీలు జరపకపోతే కింద ఉన్న టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్‌ చేయండని’ నకిలీ మెసేజ్‌లు, ఈ– మెయిల్స్‌ పంపించారు. మరికొందరికి మీ కంప్యూటర్, రూటర్, ఇంటర్నెట్‌ సాంకేతిక పరికరాలలో సమస్యలు వచ్చాయని పరిష్కారం కోసం టోల్‌ ఫ్రీ నంబర్‌కు ఫోన్‌ చేయాలని సూచించారు. కస్టమర్లు స్పందించగానే.. టెలీ కాలర్లు కాల్‌ రిసీవ్‌ చేసుకొని మోసానికి తెరలేపేవారు.  
  • ఎలక్ట్రానిక్స్‌ను హ్యాకింగ్‌ చేసి.. క్రెడిట్‌ కార్డ్‌ నంబర్, సీవీవీ, ఎక్స్‌పైరీ తేదీ, పిన్, పేరు ఇతరత్రా వివరాలను తస్కరించారు. వీటి సహాయంతో లావాదేవీలు నిర్వహించేందుకు నలుగురు హైదరాబాదీలతో చేతులు కలిపారు. ఇలా ఇప్పటివరకు సాంకేతిక సేవల ముసుగులో ఇంటర్నేషనల్‌ క్రెడిట్‌ కార్డ్‌దారులను రూ.25 కోట్ల మేర మోసం చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.  
  • ∙అన్ని రకాల సాంకేతిక ఆధారాలను సేకరించిన సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్స్‌ ఏసీపీ జీ శ్రీధర్, ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌లు.. న్యూఢిల్లీకి చెందిన నవీన్‌ భూటానీ, మోహిత్, మోను, హైదరాబాద్‌కు చెందిన నాగరాజు బొండాడ, దొంతుల శ్రవణ్‌ కుమార్, సాధనాల ముక్కంటి శ్రీనివాసరావు, పవన్‌ వెన్నెలకంటిలను అరెస్ట్‌ చేశారు. వీరి నుంచి రూ.1.11,40,000 నగదుతో పాటు మూ డు వాహనాలు, నాలుగు ల్యాప్‌ట్యాప్‌లు, 12 సెల్‌ఫోన్లు, 10 సీపీయూలు, 6 రబ్బర్‌ స్టాంప్‌లు, 16 చెక్కుబుక్‌లు, 18 డెబిట్‌ కార్డ్‌లను స్వాధీనం చేసుకున్నారు. 

ఇలా బయటపడింది..  

  • హైదరాబాద్‌లోని హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ కంట్రోల్‌ యూనిట్‌ ప్రతినిధి అబ్దుల్‌ నయీమ్‌.. బ్యాంక్‌ లావాదేవీలను పర్యవేక్షిస్తున్నప్పుడు హెచ్‌డీఎఫ్‌సీ జారీ చేసిన స్వైపింగ్‌ మెషీన్‌లో    రూ.64.40 లక్షల అనధికార లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు.  దీంతో ఇటీవల సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించారు.  
  • ఇలా ఐసీఐసీఐ, కొటక్‌ మహీంద్రా, ఐడీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ, ఆర్‌బీఎల్, యాక్సెస్‌ బ్యాంక్‌లకు గత ఆరు నెలల్లో రూ.50 కోట్ల మేర మోసం చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది.  
  • 2018 నుంచి మోసాలకు పాల్పడుతున్నారు. కొట్టేసిన మొత్తం ఇంకా పెరిగే అవకాశముంది. ఈ ఘరానా సైబర్‌ నేరగాళ్లు  దుబాయ్‌లో కూడా రూ.20 కోట్ల వరకు మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. పరారీలో ఉన్న దుబాయ్‌కు చెందిన అర్షద్, అమీర్, డాక్టర్‌ ఫహద్‌లను పోలీసులు అరెస్ట్‌ చేయనున్నారు. 

లావాదేవీలన్నీ హైదరాబాద్‌లోనే.. 
హైదరాబాద్‌కు చెందిన నాగరాజు బొండాడ అలియాస్‌ రాజు, దొంతుల శ్రవణ్‌ కుమార్, సాధనాల ముక్కంటి శ్రీనివాసరావు, పవన్‌ వెన్నెలకంటి మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ వెనకాలే డొల్ల కంపెనీలను ఏర్పాటు చేశారు. టెలీ కాలర్లు తస్కరించిన ఇంటర్నేషనల్‌ క్రెడిట్‌ కార్డుల వివరాలతో షాపింగ్‌ చేయడం కోసం మర్చంట్‌ సైట్లను అభివృద్ధి చేశారు. వీటికి సొంత బ్యాంక్‌ ఖాతాలతో పేమెంట్‌ గేట్‌వేలను అనుసంధానించారు. దీంతో మోసపూరిత క్రెడిట్‌ కార్డ్‌లతో వాళ్ల వెబ్‌సైట్లలో లావాదేవీలు జరపగానే ఆ సొమ్ము వాళ్ల ఖాతాలోనే జమ అయ్యే 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top