పుత్తూరులో కాసం ఫ్యాషన్స్ ప్రారంభోత్సవం
పుత్తూరు: పుత్తూరు పట్టణంలో బుధవారం కాసం ఫ్యాషన్స్ 22వ స్టోర్‌ను సినీ తార, ప్రముఖ యాంకర్ అనసూర్య భరద్వాజ్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాసం ఫ్యాషన్స్ చౌకగా దుస్తులను అందించడమే కాకుండా, యువతకు ఉపాధిని సైతం కల్పిస్తోందని తెలిపారు. అధునాతన వస్త్రాలను తక్కువ ధరలకు అందిస్తున్న కారణంగానే వినియోగదారులు కాసంను ఆదరిస్తున్నారన్నారు. షాపింగ్ మాల్ డైరెక్టర్లు కాసం నమశ్శివాయ, కాసం మల్లికార్జున్, కాసం కేదారినాథ్, కాసం శివప్రసాద్ మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో గత 5 సంవత్సరాలుగా వినియోగదారుల ఆదరణ పొందుతూ ఇప్పటి వరకు 22వ స్టోర్లు ప్రారంభించామని తెలిపారు. తమ సంస్థ ద్వారా పుత్తూరులో స్థానికులు 150 మందికి ఉపాధి కల్పిస్తున్నామన్నారు. ప్రారంభోత్సవానికి విచ్చేసిన అనసూర్య భరద్వాజ్ను చూడడానికి ఉదయం నుంచి అభిమానులు, యువత బారులు తీరారు. కాసం షాపింగ్ మాల్ ప్రాంతంలో పండగ వాతావరణం నెలకొంది. కార్యక్రమంలో పుల్లూరు అరుణ్ కుమార్, విశాల్, వరుణ్, అరుణ్, కార్తీక్, కాసం ఫణిత్, కాసం సాయికృష్ణ, యాంసాని ప్రవీణ్, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు


