
నకిలీ లాటరీ టికెట్లు
పుంగనూరులో నకిలీ లాటరీ టికెట్ల విక్రయాలు జోరందుకున్నాయి. కొందరు ధనార్జనే ధ్యేయంగా చెలరేగిపోతున్నారు.
జగనన్న కార్యక్రమాన్ని
విజయవంతం చేద్దాం
తిరుపతి మంగళం : మామిడి రైతులకు అండగా నిలిచేందుకు ఈనెల 9వ తేదీ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యానికి విచ్చేయనున్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరెడ్డి పిలుపునిచ్చారు. తిరుపతి పద్మావతిపురంలోని పార్టీ క్యాంప్ కార్యాలయం వద్ద శుక్రవారం పూతలపట్టు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్‌కుమార్ మర్యాదపూర్వకంగా భూమనను కలిశారు. అనంతరం మామిడి రైతులకు అండగా నిలిచేందుకు వస్తున్న వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి కార్యక్రమంపై చర్చించారు. కూటమి ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని భూమన సూచించారు.
పోస్టర్ల ఆవిష్కరణ
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని రైతులు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ సూచించారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్‌లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ కరువు, అకాల వర్షాలు వంటి ప్రకృతి వైఫరీత్యాల వల్ల పంట దెబ్బతింటే ఈ పథకం ద్వారా నష్టపరిహారం చెల్లిస్తారన్నారు. నిర్ణీత సమయంలో ప్రీమియం చెల్లించి నమోదు చేసుకునే రైతులు ఈ పథకానికి అర్హులన్నారు. చిత్తూరు జిల్లాలో వరికి రూ.42 వేలు, రాగికి రూ.17 వేలు, కందులకు రూ.20 వేలు ఒక ఎకరానికి బీమా సౌకర్యం ఉంటుందన్నారు. ఇతర వివరాలకు క్లస్టర్ మేనేజర్ సాగర్ 9059634144 నంబర్‌లో సంప్రదించాలన్నారు. డివిజనల్ కో ఆర్డినేటర్ పెద్దన్న పాల్గొన్నారు.
– 8లో

నకిలీ లాటరీ టికెట్లు