
ఎట్టకేలకు ‘ఓఆర్‌ఎం’ ప్రారంభం
చిత్తూరు కార్పొరేషన్: చిత్తూరులోని ఎస్‌పీఎం (ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతు కేంద్రం)లో నూతన ఓఆర్‌ఎం (ఆయిల్ రీజనరేషన్ మిషన్)ను ఎట్టకేలకు శుక్రవారం ట్రాన్స్‌కో ఎస్‌ఈ ఇస్మాయిల్‌అహ్మద్ ప్రారంభించారు. పాత మిషన్ రోజూ 200 లీటర్ల నూనెను శుద్ధి చేస్తుంది. కొత్త మిషన్ 2వేల లీటర్లను సిద్ధం చేస్తుంది. రాయలసీమలోనే మొదటి ఓఆర్‌ఎంను ఇక్కడ అందుబాటులోకి తీసుకువచ్చారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఈ మిషన్ ఏర్పాటుకు రూ.50 లక్షలు మంజూరు చేశారు. నెలల తరబడి మిషన్‌ను అమర్చకుండా తాత్సారం చేశారు. అయితే సాక్షి పత్రికలో పలుమార్లు దీనిపై కథనాలు రావడంతో అధికారులు స్పందించి మిషన్‌ను ఇన్‌స్టాల్ చేశారు. అయితే ఈ మిషన్‌ను ప్రారంభించినప్పటికీ నిర్వహణ, పర్యవేక్షణకు టెక్నీషియన్‌ను నియమించకపోవడం విమర్శలకు తావిస్తోంది.