మామిడి.. | - | Sakshi
Sakshi News home page

మామిడి..

Jul 4 2025 3:46 AM | Updated on Jul 4 2025 3:46 AM

మామిడ

మామిడి..

అనారోగ్య‘వసతి’
తిరుపతి జిల్లాలో ప్రభుత్వ వసతి గృహాలు అధ్వానంగా మారాయి. విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
సిద్ధమవుతున్న ఓఆర్‌ఎం
చిత్తూరు జిల్లా కేంద్రంలోని ట్రాన్స్‌కో ఎస్‌పీఎం లో నూతన ఓఆర్‌ఎం ఇన్‌స్టాలేషన్‌కు ఎట్టకేలకు మోక్షం లభించింది.

శుక్రవారం శ్రీ 4 శ్రీ జూలై శ్రీ 2025

మాజీ సీఎం వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి బంగారుపాళెం పర్యటన సందర్భంగా హెలిప్యాడ్‌ను పరిశీలిస్తున్న వైఎస్సార్‌సీపీ నేతలు

తిరుపతి మంగళం: మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్‌సీపీ రీజనల్‌ కో–ఆర్డినేటర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి మారుతీ నగర్‌లోని పెద్దిరెడ్డి క్యాంప్‌ కార్యాలయంలో గురువారం ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పార్టీ అధ్యక్షులు వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనలకు అడ్డంకులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఎన్ని కేసులు పెట్టినా లెక్కచేయకుండా ఈ నెల 9వ తేదీన చిత్తూరు జిల్లా బంగారుపాళ్యానికి వస్తున్న జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనను విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు.

మారానని చెప్పి ..

ధర పెంచకుండా మారాం చేస్తున్నారు!

ఆర్‌కే.రోజా మాట్లాడుతూ రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన ఏకై క నాయకుడు జగనన్న అన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక పొగాకు, మిర్చి, మామిడి రైతులు కన్నీరు పెడుతున్నారని తెలిపారు. చంద్రబాబు అధికారంలోకి రాకముందు తాను మారానని చెప్పి అధికారంలోకి వచ్చాక కుక్కతోకర వంకర లాగా బుద్ధి చూపుతారన్నారు. చిత్తూరు జిల్లా బంగారుపాళెంలో మామిడి రైతులకు అండగా ఉండేందుకు జగన్‌మోహన్‌రెడ్డి వస్తున్నారన్నప్పుడే చంద్రబాబుకు రైతుల కష్టాలు గుర్తొస్తాయా? అని ప్రశ్నించారు. మామిడి రైతులకు గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఏడాదిలో ఏదో పొడిచేసినట్లు కూటమి నాయకులు ఇంటింటికీ వెళ్లి గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఈవీఎం మాయాజాలంతో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో గెలిచిందే తప్ప ప్రజల మద్దతుతో కాదన్నారు. ఈనెల 9వ తేదీన కూటమి ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు పెట్టినా జగనన్న పర్యటనను విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు. సమావేశంలో చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామి, మాజీ మంత్రి ఆర్‌కే.రోజా, ఎమ్మెల్సీలు భరత్‌, సిపాయి సుబ్రమణ్యం, మాజీ ఎంపీ రెడ్డెప్ప, మాజీ ఎమ్మెల్యేలు బియ్యపు మధుసూధన్‌రెడ్డి, వెంకటేగౌడ్‌, సునీల్‌కుమార్‌, లలితకుమారి, నియోజకవర్గ సమన్వయకర్తలు భూమన అభినయ్‌రెడ్డి, నూకతోట రాజేష్‌, కృపాలక్ష్మి, జెడ్పీ చైర్మన్‌ శ్రీనివాసులు పాల్గొన్నారు.

– 8లో

– 8లో

– 8లో

న్యూస్‌రీల్‌

నష్టాల్లో మామిడి రైతు

మద్దతు ధర లేక రోడ్డు పాలుచేస్తున్న అన్నదాతలు వారికి అండగా నిలిచేందుకు ముందుకొస్తున్న మాజీ సీఎం వైఎస్‌.జగన్‌ 9న బంగారుపాళ్యానికి రాక కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం పార్టీ శ్రేణులకు పెద్దిరెడ్డి, భూమన పిలుపు

ఏ ప్రాంతానికెళ్లినా

జన సునామీనే

భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ గత ఆరు నెలలుగా జగన్‌మోహన్‌ రెడ్డి ఏ ప్రాంతానికి వెళ్లినా అనూహ్యమైన జన స్పందన వస్తోందన్నారు. చంద్రబాబు సొంత జిల్లాలో మామిడి రైతులను పట్టించుకునే పరిస్థితి లేదని మండిపడ్డారు. మామిడి రైతులకు అండగా నిలిచేందుకు జగనన్న వెంట ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ప్రతి నియోజకవర్గం నుంచి పార్టీ శ్రేణులు, ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు.

కష్టాల్లో మామిడి రైతులు

మాజీ డెప్యూటీ సీఎం నారాయణస్వామి మాట్లాడుతూ చంద్రబాబు సొంత జిల్లాలో మామిడిని పండించే రైతుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. మామిడి పంటకు గిట్టుబాటు ధర లేక రోడ్డు పక్కన పారబోస్తున్నారని చెప్పారు. ఇలాంటి కష్టాలు ఎల్లో మీడియాకు కనిపించవా? అని ప్రశ్నించారు. జగనన్న పాలనలోనే రైతు సంక్షేమమని గుర్తుచేశారు.

‘చంద్రబాబు సొంత జిల్లాలో మామిడి రైతులు రోడ్డున పడ్డారు. గిట్టుబాటు ధర కల్పించకుండా వేధింపులకు గురిచేస్తున్నారు. చేతికొచ్చిన పంట నోటికందకుండా రోడ్డుపాలు చేస్తున్నారు. ఇల్లూవాకిలి వదిలి పంటనెత్తుకుని జ్యూస్‌ ఫ్యాక్టరీల వద్ద.. ర్యాంప్‌ల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఇన్ని అవస్థలు పడుతున్నా సీఎం చంద్రబాబుకు కనిపించడం లేదు. గిట్టుబాటు ధర కల్పించి మామిడి రైతును ఆదుకోవాల్సింది పోయి వేధింపులకు దిగుతున్నారు. చెట్లు నరికివేస్తున్నారంటూ పోలీస్‌ స్టేషన్ల చుట్టూ తిప్పుకుంటున్నారు. మామిడి రైతుకు అండగా నిలిచేందుకు నేనున్నానంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ముందుకొస్తున్నారు. ఈనెల 9న బంగారుపాళ్యానికి విచ్చేయనున్నారు. ఆయన పర్యటనను కలసి కట్టుగా విజయవంతం చేయాలి’ అని వైఎస్సార్‌సీపీ నాయకులు పిలుపునిచ్చారు. తిరుపతిలో జరిగిన సమావేశంలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

మామిడి..1
1/4

మామిడి..

మామిడి..2
2/4

మామిడి..

మామిడి..3
3/4

మామిడి..

మామిడి..4
4/4

మామిడి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement