
కార్యకర్తలకు అండగా ఉంటాం
వైఎస్సార్‌సీపీ కార్యకర్తల కష్ట సుఖాల్లో తోడుగా అండగా ఉంటామని, కేసులకు భయపడొద్దని రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. చంద్రబాబు సంపద సృష్టిస్తానని చెప్పి, ఎమ్మెల్యేలు గుట్టలు, కొండలని తవ్వి తరలించి సొమ్ము చేసుకుంటున్నారని, అదేనా సంపద సృష్టించడం అని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీ సామాజిక వర్గంలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ రూ.1500 చొప్పున ఇస్తానన్న బాబు ఒక్క పైసా కూడా ఇవ్వకపోవడం దారుణమని దుయ్యబట్టారు, నవరత్నాలు పథకం ద్వారా జగనన్న సంక్షేమ పథకలూ అందిస్తే చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాల ద్వారా ప్రజలను దారుణంగా మోసం చేశారని గుర్తు చేశారు. వైఎస్సార్ సీపీ జెండా ఎత్తిన ప్రతి కార్యకర్తకు ప్రత్యేక గుర్తింపు ఉంటుందన్నారు.