
గుణశేఖర్‌రెడ్డిపై కేసు నమోదు చేయండి
పోలీసులకు ఫిర్యాదు చేసిన వైఎస్సార్ సీపీ నేతలు
నగరి: మాజీ మంత్రి ఆర్కే రోజా, ఆమె కుటుంబ సభ్యుల పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా అసత్యపు ఆరోపణలు చేసిన విజయపురం మండలం, కళియంబాకం గ్రామానికి చెందిన తెలుగునాడు ట్రేడ్ యూనియన్ జిల్లా కార్యదర్శి గుణశేఖర్‌రెడ్డిపై కేసు నమోదు చేయాలని సీఐ విక్రమ్‌కు వైఎస్సార్ సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. బుధవారం మున్సిపల్ చైర్మన్ పీజీ నీలమేఘం ఆధ్వర్యంలో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినవారు తమ ఫిర్యా దు పత్రాన్ని సీఐకి అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ నీలమేఘం మాట్లాడుతూ అధికారపార్టీ నేతల వద్ద మెప్పుపొందేందుకు గుణశేఖర్‌రెడ్డి తనపైనా, మాజీ మంత్రి కుటుంబంపైనా లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఆధారా లు లేకుండా ఆరోపణలు చేయడం నీచ రాజకీయానికి పరాకాష్ఠ అని, ఆయన అవివేకానికి నిద ర్శనమన్నారు. సంఘంలో గౌరవప్రదమైన స్థా నంలో ఉన్న వారిపై రాజకీయ లబ్ధి కోసం, స్వప్రయోజనాలకు ఆరోపణలు చేస్తున్న గుణశేఖర్‌రెడ్డిని అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టా లని కోరామన్నారు. వైఎస్సార్ సీపీ మున్సిపల్ శాఖ అధ్యక్షుడు రమేష్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ బాలన్, కౌన్సిలర్లు గోపాల్‌రెడ్డి, మురుగ, నాయకులు కృష్ణమూర్తి, అయ్యప్ప పాల్గొన్నారు.
పరువు నష్టం దావా వేసిన మాజీ మంత్రి
తనపై, తన కుటుంబంపై అసత్యపు ఆరోపణలు చేసిన గుణశేఖర్‌రెడ్డిపై మాజీమంత్రి ఆర్కేరోజా బుధవారం పరువునష్టం దావా చేశారు.
నాటు బాంబు పేలి
బాలుడికి గాయాలు
యాదమరి: వన్యప్రాణుల కోసం పెట్టిన నాటు బాంబుకు ఓ బాలుడు తీవ్రగాయాలు పాలైన ఘటన మండలంలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. మండలంలోని కాశిరాళ్ల కొత్తూరు గ్రామానికి చెందిన కృష్ణయ్య భార్య తులసి తన కుమారుడు లోహిత్(7)ను వెంట తీసుకుని మేకలు మేపడానికి సమీప అడవిలోకి వెళ్లారు. అయితే అక్కడ వన్యప్రాణుల వేట కోసం వేటగాళ్లు నాటు బాంబును అమర్చారు. బాలుడి కాళ్లకు ఏదో తగిలిందని గమనించి.. దానిని చేతిలోకి తీసుకున్నాడు. అది చేతిలోనే పేలడంతో బాలుడి ఎడమ చేతికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతని తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే ఈ ఘటనపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని స్థానిక ఎస్‌ఐ ఈశ్వర్ తెలిపారు.
చిత్తూరులోని దుకాణంలో చోరీ
చిత్తూరు అర్బన్: నగరంలోని పొన్నియమ్మగుడి వీధిలో ఉన్న ఓ దుకాణంలో రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీ పాల్పడిన ఘటన బుధవారం వెలుగు చూసింది. పొన్నియమ్మ గుడివీధిలో బాబు అనే వ్యక్తి ఎలక్ట్రికల్ దుకా ణం నిర్వహిస్తున్నాడు. మంగళవారం రాత్రి దుకాణం మూసి వేసి, ఇంటికి వెళ్లాడు. బుధవారం ఉదయం వచ్చి చూడగా తలుపులు ప గులగొట్టి పలు వస్తువులను చోరీ చేసిన విషయం గుర్తించాడు. పోలీసులకు సమాచా రం ఇవ్వగా, ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు విచారణ ప్రారంభించారు.