300 సెల్‌ఫోన్ల అప్పగింత | Sakshi
Sakshi News home page

300 సెల్‌ఫోన్ల అప్పగింత

Published Sat, Apr 13 2024 12:35 AM

బాధితురాలికి ఫోన్‌ అందిస్తున్న ఎస్పీ మణికంఠ  - Sakshi

● సైబర్‌క్రైమ్‌ ఫిర్యాదులకు నంబర్‌ : 1930 ● ఎస్పీ మణికంఠ వెల్లడి

చిత్తూరు అర్బన్‌: జిల్లా వ్యాప్తంగా పలువురు పోగొట్టుకున్న సెల్‌ఫోన్లను ‘చాట్‌బాట్‌’ యాప్‌ ద్వారా పోలీసుశాఖ రికవరీ చేసింది. సుమారు రూ.65 లక్షల విలువైన 300 సెల్‌ఫోన్లను బాధితులకు అప్పగించింది. శుక్రవారం చిత్తూరులోని పోలీసు అతిథిగృహంలో ఎస్పీ మణికంఠ మాట్లాడుతూ వివరాలను వెల్లడించారు. సెల్‌ఫోన్ల రికవరీకి జిల్లా పోలీసుశాఖ రూపొందించిన శ్రీచాట్‌బాట్‌శ్రీ యాప్‌కు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందన్నారు. బాధితులు ఎవరైనా 9440900004 నంబర్‌కు వాట్సాప్‌లో హాయ్‌ అని మెసేజ్‌ పెడితే చాలని తెలిపారు. ఇందులో అడిగే ప్రశ్నలకు సమాధానాలిస్తే ఫిర్యాదు నమోదవుతుందన్నారు. చాట్‌బాట్‌ జిల్లాలో ప్రవేశపెట్టినప్పటి నుంచి అయిదు దశల్లో రూ.3.15 కోట్ల విలువైన 1,500 ఫోన్లను తెప్పించి బాధితులకు అందజేశామని వెల్లడించారు. అలాగే సైబర్‌క్రైమ్‌ ఉచ్చులోపడి నగదు పోగొట్టుకుంటే వెంటనే 1930 నంబర్‌కు ఫోన్‌చేసి వివరాలు చెప్పాలన్నారు. ఇలా చేయడం వల్ల నగదు బ్యాంకు ఖాతాలు మారకుండా ఫ్రీజ్‌ చేస్తామని తెలిపారు. అనంతరం సెల్‌ఫోన్ల రికవరీలో ప్రతిభ చూపిన సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందించారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement