
భారతదేశంలో కొత్త జీఎస్టీ అమలులోకి వచ్చిన తరువాత వాహన అమ్మకాలు బాగా పెరిగాయి. కాగా ఇప్పుడు కొన్ని వాహన తయారీ సంస్థలు కొన్ని ఎంపిక చేసిన కార్లపై లక్షల రూపాయల డిస్కౌంట్ ప్రకటించింది. దీంతో వీటి ప్రారంభ ధరలు (ఎక్స్ షోరూమ్) చాలా వరకు తగ్గుతాయి. ఈ కథనంలో ఏ మోడల్‌పై ఎంత రేటు తగ్గిందనే విషయాలను చూసేద్దాం.
మోడల్ వారీగా తగ్గిన ధరలు
➤కియా సోనెట్: రూ. 1.02 లక్షలు
➤మారుతి బాలెనొ: రూ. 1.05 లక్షలు
➤హోండా సిటీ: రూ. 1.27 లక్షలు
➤మారుతి ఇన్విక్టో: రూ. 1.40 లక్షలు
➤కియా కారెన్స్ క్లావిస్: రూ. 1.41 లక్షలు
➤కియా సెల్టోస్: రూ. 1.47 లక్షలు
➤ఫోక్స్‌వ్యాగన్ వర్టస్: రూ. 1.50 లక్షలు
➤హోండా ఎలివేట్: రూ. 1.51 లక్షలు
➤కియా సిరోస్: రూ. 1.6 లక్షలు
➤ఫోక్స్‌వ్యాగన్ టైగన్: రూ. 1.80 లక్షలు
➤మారుతి గ్రాండ్ విటారా: రూ. 1.80 లక్షలు
➤స్కోడా స్లావియా: రూ. 2.25 లక్షలు
➤మహీంద్రా XUV400: రూ. 2.50 లక్షలు
➤స్కోడా కుషాక్: రూ. 2.50 లక్షలు
➤మహీంద్రా మరాజో: రూ. 3 లక్షలు
ఇదీ చదవండి: ఆక్టావియా ఆర్ఎస్ లాంచ్: అప్పుడే అన్నీ కొనేశారు!
వాహన తయారీ సంస్థలు ప్రకటించే ఆఫర్స్ లేదా డిస్కౌంట్స్ నగరాన్ని బట్టి మారే అవకాశం ఉంది. కాబట్టి పండుగల సమయంలో కారు కొనాలనుకునే కస్టమర్లు.. తగ్గింపులకు సంబంధించిన కచ్చితమైన వివరాలు తెలుసుకోవడానికి సమీపంలోని కంపెనీ అధికారిక డీలర్షిప్ సందర్శించి తెలుసుకోవడం ఉత్తమం. అంతే కాకుండా ఈ తగ్గింపులు బహుశా.. పరిమిత కాలం మాత్రమే అందుబాటులో ఉండే అవకాశం ఉంది.