
ప్రముఖ టెక్ దిగ్గజం 'గూగుల్'.. ఇంటర్యూ విధానంలో మార్పు తీసుకురావడానికి సిద్దమైంది. మళ్ళీ పేస్ టు పేస్ ఇంటర్వ్యూలను నిర్వహించాలని పేర్కొంది. వర్చువల్ ఇంటర్వ్యూల ద్వారా మోసాలు జరుగుతున్నాయని, ఈ కారణంగానే ముఖాముఖి ఉద్యోగ ఇంటర్వ్యూలను తిరిగి అమలు చేయనున్నట్లు సీఈఓ 'సుందర్ పిచాయ్' వెల్లడించారు.
వర్చువల్ విధానంలో ఇంటర్యూలు నిర్వహిస్తుంటే కొందరు అభ్యర్థులు ఏఐను ఉపయోగించి మోసం చేస్తున్నారు. దీనివల్ల నైపుణ్యం ఉన్నవారు ఉద్యోగం తెచ్చుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారు. ఫిబ్రవరిలో జరిగిన ఒక సమావేశంలో.. ఏఐ వినియోగం పెరుగుతున్నందున వర్చువల్ ఇంటర్వ్యూలు సమంజసం కాదని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. కాబట్టి అభ్యర్థులు ఇకపై తప్పకుండా ఒక రౌండ్ పేస్ టు పేస్ ఇంటర్వ్యూకు హాజరు కావాలని పిచాయ్ పేర్కొన్నారు.
పిచాయ్ స్పందిస్తూ హైబ్రిడ్ విధానాన్ని సమర్థించారు. మనమందరం హైబ్రిడ్ పద్ధతిలో పని చేస్తున్నాము, కాబట్టి.. ఇంటర్వ్యూలలో కొంత భాగాన్ని స్వయంగా నిర్వహించడం గురించి ఆలోచించాలి. ఇది అభ్యర్థులకు గూగుల్ సంస్కృతిని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుందని నేను భావిస్తున్నానని అన్నారు.
ఇదీ చదవండి: కోర్టుకెక్కిన మస్క్ కంపెనీ: యాపిల్, ఓపెన్ఏఐ దావా..
వర్చువల్ విధానం ద్వారా.. ఇంటర్యూలను షెడ్యూల్ చేయడం సులభం. అంతే కాకుండా శ్రమ, వ్యయం కూడా తగ్గుతాయి. కోవిడ్ తరువాత ఈ విధానం వల్ల మోసాలు జరుగుతున్నట్లు తెలిసింది. కాబట్టి పద్దతిని తప్పకుండా మార్కకోవాల్సిన అవసరం ఉంది.