ఈవీ ఛార్జింగ్ కష్టాలకు చెక్.. 15 నిమిషాల్లో ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జ్!

Ex Ather execs startup claims to charge EV batteries in 15 mins - Sakshi

ఈవీ కంపెనీలు తమ కస్టమర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించాయి. ఎలక్ట్రిక్ వేహికల్(ఈవీ) కంపెనీలు కొన్ని సంవత్సరాల క్రితం వరకు మైలేజీ సమస్యపై దృష్టి సారించి ఆ సమస్యను పరిష్కరించాయి. అయితే, ఇప్పుడు ఈవీ కొనుగోలుదారులు ప్రధానంగా ఎదుర్కొంటున్న ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ సమస్యలపై ఫోకస్ పెట్టాయి. బెంగళూరుకు చెందిన స్టార్టప్ ఎక్స్ పోనెంట్ ఎనర్జీ ఈ సమస్యకు సమాధానం కనుగొన్నట్లు పేర్కొంది. ఎక్స్ పోనెంట్ ఎనర్జీ తన టెక్నాలజీ కేవలం 5-15 నిమిషాల్లో ఏదైనా వాణిజ్య ఎలక్ట్రిక్ వాహన బ్యాటరీని సున్నా నుంచి 100 శాతానికి చార్జ్ చేయగలదని పేర్కొంది.

ఈవీ స్టార్టప్ అథర్ ఎనర్జీలో చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ గా పనిచేసిన స్టార్టప్ సహ వ్యవస్థాపకుడు అరుణ్ వినాయక్ ప్రకారం.. ఈ టెక్నాలజీకి ప్రత్యేక బ్యాటరీలు కూడా అవసరం లేదు. నేడు ఉపయోగించే రెగ్యులర్ లిథియం-అయాన్, ఇతర సాధారణ బ్యాటరీ రకాలకు ఈ టెక్నాలజీ అనుకూలంగా ఉంది. భారతదేశం అంతటా ఛార్జ్ పాయింట్ ఆపరేటర్లు (సీపీఓలు) నడుపుతున్న ఈవీ తయారీదారులు, కంపెనీలతో ఎక్స్ పోనెంట్ కలిసి పనిచేయనున్నట్లు ఈవీ స్టార్టప్ అథర్ ఎనర్జీ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్(సీపీఓ) వినాయక్ చెప్పారు.
(చదవండి: ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు శుభవార్త!)

"ఈవిలు పర్యావరణ హితం అని చెప్పడం సమంజసం, కానీ ఛార్జింగ్ సమస్య కారణంగా ఎక్కువగా కొనుగోళ్లు జరగడం లేదు" అని వినాయక్ చెప్పారు. ఈ సమస్యకు పరిష్కారంగా ఎక్స్ పోనెంట్ ఎనర్జీ కొత్తగా ఫ్లెక్సిబుల్ ఎనర్జీ స్టాక్ అని పిలిచే కొత్త టెక్నాలజీ అభివృద్ధి చేసింది. ఇది ఎలక్ట్రిక్ వాహనలను వేగంగా చార్జ్ చేయడానికి ఉద్దేశించిన హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్ కలయిక. కంపెనీ ఒక యాజమాన్య బ్యాటరీ నిర్వహణ వ్యవస్థను(బిఎమ్ఎస్) రూపొందించింది. ఇది బ్యాటరీ ప్యాక్ ఏవిధంగా ఛార్జ్ చేయబడుతోంది, ఆ ప్యాక్ లోని విభిన్న కణాల ఆరోగ్యం ఏమిటి మొదలైనవాటిని బిఎమ్ఎస్ మానిటర్ చేస్తుంది.

ఈ రోజు మార్కెట్లో ఉన్న ఏ బిఎమ్ఎస్ కంటే ఎక్స్ పోనెంట్ బిఎమ్ఎస్ 10 రెట్లు ఖచ్చితమైనదని ఆయన పేర్కొన్నారు. ఈవీ బ్యాటరీలో లోపల వేలాది కణాలు ఉంటాయి, వేహికల్ పవర్ సోర్స్ కనెక్ట్ చేసినప్పుడు ఇది విభిన్న స్థాయిల్లో ఛార్జ్ కావొచ్చు. ఎక్స్ పోనెంట్స్ బిఎమ్ఎస్ దాని ఆరోగ్యంతో సహా మొత్తం బ్యాటరీ ఏ స్థితిలో ఉందో అర్థం చేసుకుంటుంది. ఇది బ్యాటరీల కోసం కస్టమైజ్డ్ ఛార్జింగ్ ప్రొఫైల్స్ ను కూడా సృష్టిస్తుంది, ఇది ఛార్జింగ్ చేసేటప్పుడు దానికి ప్రవహించే విద్యుత్ ను మాడ్యులేట్ చేసుకొని దాని ఆధారంగా వాహనాన్ని చార్జ్ చేస్తుంది అని అన్నారు.(చదవండి: 11 ఏళ్లకు అంతా ఉల్టా పల్టా? ఫేస్‌బుక్‌ డిలీట్‌ అంటూ కవర్‌ పేజీ)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top