ప్రభుత్వం దాడి మొదలైంది, అబ్యూజ్‌ కంటెంట్‌ తొలగించకపోతే ఫైన్‌

Australian Government Fine For Facebook And Google, Twitter And Other Digital Platforms - Sakshi

ప్రముఖ సెర్చ్‌ ఇంజిన్‌ గూగుల్‌, సోషల్‌ మీడియా నెట్‌ వర్క్‌లైన ఫేస్‌బుక్‌ (మెటా),ట్విట్టర్‌లకు ఆస్ట్రేలియా ప్రభుత్వం భారీ షాక్‌ ఇవ్వనుంది. సుమారు 5లక్షల డాలర్ల జరిమానా విధించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.  
 
ఆస్ట్రేలియాకు చెందిన నెక్ట్స్‌ టాప్‌ మోడల్‌ 'షార్లెట్ డాసన్' 2014 ఫిబ్రవరి 22 శనివారం సిడ్నీలోని తన అపార్ట్‌ మెంట్‌లో ఆత్మహత్య చేసుకున్నారు. అప్పట్లో ఆమె మరణానికి ట్విట్టర్‌ ట్రోలింగే కారణమని అస్ట్రేలియా పోలీస్‌ అధికారులు గుర్తించారు. 2014లోనే కాదు 2012లో సైతం ట్విట్టర్‌ ట్రోలింగ్‌కు గురైంది. ట్రోలింగ్‌తో మనోవేధనకు గురైన  షార్లెట్‌ డాసన్‌ కొన్ని నెలల పాటు తీవ్రమైన డిప్రెషన్‌తో బాధపడింది. కుటుంబసభ్యుల సహకారంతో ఆ డిప్రెషన్‌ నుంచి బయటపడింది. మళ్లీ మోడల్‌గా రాణించింది.

ట్రోలింగ్‌తో ఆత్మహత్య
ఓవైపు మోడల్‌గా రాణిస్తున్న షార్లెట్ డాసన్(Charlotte Dawson) నెటిజన్ల ట్రోలింగ్‌ బారి నుంచి తప్పించుకోలేకపోయింది. 2014 నెటిజన్లు ట్రోల్‌ చేయడంతో ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఆత్మహత్యతో ఆస్ట్రేలియాలో పెద్ద ఎత్తున ఆందోళనలు వెల్లువెత్తాయి. సెర్చ్‌ ఇంజిన్‌ సంస్థలు, సోషల్‌ మీడియా సంస్థలు ఆస్ట్రేలియా ప్రభుత్వానికి జవాబుదారి తనంగా ఉండేలా చట్టాలను అమలు చేయాలని ఆందోళనకారులు డిమాండ్లు చేశారు. ఆందోళన కారుల డిమాండ్లపై ఆస్ట్రేలియా ప్రభుత్వం 2015లో ప్రపంచంలోనే తొలిసారి ఈ-సేప్టీ కమిషన్‌ ను ఏర్పాటు చేసింది. సేఫ్టీ కమిషన్‌ను ఏర్పాటు చేసిన ఇన్నేళ్లలో గత 3 నెలల నుంచి సోషల్‌ మీడియాలో అబ్యూజ్‌ కంటెంట్‌పై ఎక్కువగా  ఫిర్యాదులు అందినట్లు ఈ-సేఫ్టీ కమిషనర్‌ జూలీ ఇన్మాన్ గ్రాంట్ తెలిపారు. ఈ సందర్భంగా 33ఏళ్ల నుంచి సేఫ్టీ కమిషన్‌ విభాగంలో పనిచేస్తున్న తాను.. కోవిడ్‌ -19లో బాధితుల నుంచి అబ్యూజ్‌ (విషపూరితమైన) కంటెంట్‌పై  వచ్చిన ఫిర్యాదులు గతంలో ఎప్పుడూ చూడలేదని తెలిపారు.

2015లో ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈసేఫ్టీ కమిషన్‌ చట్టాన్నిఅమలు చేసింది. కానీ చర్యలు తీసుకునే అధికారం లేకుండా పోయింది.అయితే కోవిడ్‌ కారణంగా ఆన్‌లైన్‌లో విషపూరితమైన కంటెంట్‌పై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో ఆస్ట్రేలియా ప్రభుత్వ పెద్దలు అబ్యూజ్‌పై కంటెంట్‌పై చర్యలు తీసుకునే అధికారం ఈ-సేఫ్టీ కమిషన్‌కు అప్పగిచ్చింది. ఇప్పుడు ఆ ఈ - కమిషన్‌ సభ్యులు ఆన్‌లైన్‌ సేఫ్టీ యాక్ట్‌ 2021పేరుతో గూగుల్‌,ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌పైతో పాటు మిగిలిన ఫ్లాట్‌ ఫామ్‌లపై చర్యలు తీసుకోనున్నారు.  ఇందులో భాగంగా ఈ కమిషన్‌ చేసిన ఆదేశాల మేరకు 24గంటల్లో పైన పేర్కొన్న సోషల్‌ మీడియా నెట్‌ వర్క్‌లలో పూర్తిగా అబ్యూజ్‌ కంటెంట్‌ను తొలగించాల్సి ఉంది. లేదంటే సంబంధిత సంస్థల ప్రతినిధులకు  5లక్షలడాలర్లు, వ్యక్తులకు లక్షా 11వేల డాలర్ల ఫైన్‌ విధించనుంది.

చదవండి: గూగుల్‌ అసిస్టెంట్‌తో టీకాల బుకింగ్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top