
పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య
సూపర్‌బజార్(కొత్తగూడెం): తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య అని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. శుక్రవారం బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో దొడ్డి కొమరయ్య వర్ధంతి నిర్వహించారు. తొలుత కొమరయ్య చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం పోరాటం చేసిన మహనీయుడు కొమరయ్య అని కీర్తించారు. తెలంగాణ సాయుధ పోరాటం పేరు వినగానే మొదట గుర్తుకు వచ్చేది దొడ్డి కొమరయ్య పేరని వ్యాఖ్యానించారు. దొరల దురాగతాలను ఎదిరించిన గొప్పవీరుడని కొనియాడారు.
మాజీ సీఎం రోశయ్యకు నివాళి
బహుముఖ ప్రజ్ఞాశాలి మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య అని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో మాజీ ముఖ్యమంత్రి, మాజీ తమిళనాడు గవర్నర్ రోశయ్య జయంతి నిర్వహించారు. మొదట రోశయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళుల ర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏ పనినైనా నిబద్ధతతో చేసే ఆయన ముఖ్యమంత్రిగా, ఆర్థిక మంత్రిగా రాష్ట్రానికి విశేష సేవలందించారని కొనియాడారు. అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్, ఉపాధి కల్పనాధికారి శ్రీరామ్, క్రీడల అధికారి పరంధామరెడ్డి, బీసీ వెల్ఫేర్ అధికారి ఇందిర, కలెక్టరేట్ ఏఓ అనంత రామకృష్ణ, బీసీ సంక్షేమాధికారి ఇందిర, కురుమ సంఘం సభ్యులు దూడల బుచ్చయ్య, లింగయ్య, రవికుమార్, చంద్రశేఖర్, దూడల కిరణ్, సుంక ప్రవీణ్, కోటిలింగం, సంపత్‌కుమార్, కె.రవి, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.
ఐటీడీఏలో..
భద్రాచలం: మాజీ ముఖ్యమంత్రిగా కొణిజేటి రోశయ్యకు ఐటీడీఏలో శుక్రవారం ఘనంగా నివాళుల ర్పించారు. పీఓ బి.రాహుల్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పీఓ ఆలయ పరిసరాల్లో భక్తులు బస చేసే, భక్తులు వచ్చే పలు ప్రదేశాలను సందర్శించారు. రామాలయం, అన్నదాన సత్రం, గోదావరి కరకట్ట, ఇతర ప్రదేశాలను పరిశీలించారు. ఆ తర్వాత మాట్లాడుతూ శ్రీసీతారామ చంద్రస్వామి దేవస్థానానికి వచ్చే భక్తులు ఐటీడీఏ ప్రాంగణంలోని గిరిజన మ్యూజియానికి సులువుగా చేరేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అంబేద్కర్ సెంటర్‌లోని మహనీయుల విగ్రహాలను సందర్శించి, మరమ్మతులు చేయించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమాల్లో డేవిడ్ రాజ్, మణెమ్మ, హరీష్, భాస్కరరావు, ఉదయ్ కుమార్, రమేష్, వేణు, లక్ష్మీనారాయణ, ప్రభాకర్ రావు, హరికృష్ణ, ఆదినారాయణ, అలివేలు మంగతాయారు, శ్రీనివాస్, రవీందర్, వెంకటేశ్వర్లు, వీరభద్రం పాల్గొన్నారు.
కలెక్టర్ జితేష్ వి.పాటిల్

పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య